“మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి…

“మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి

అబూ సఈద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి. ఒకవేళ అతడు 5 రకాతులు చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు అతడి నమాజు ను (సరి సంఖ్యగా) పరిపూర్ణం చేస్తాయి. ఒకవేళ అతడు నాలుగు (రకాతులు) చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు షైతానుకు పరాభవంగా మారుతాయి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని ఈ విధంగా స్పష్టపరుస్తున్నారు. నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ఒకవేళ తన నమాజు లో అయోమయంలో పడిపోతే, తాను ఎన్ని రకాతులు చదివినాడో జ్ఞాపకంలేకపోతే, అంటే మూడు రకాతులు చదివినాడా లేక నాలుగు రకాతులు చదివినాడా నిర్ణయించుకోలేక పోతున్నట్లయితే, సందేహాన్ని కలిగిస్తున్న ఆ అదనపు రకాతు విషయాన్ని వదిలివేయాలి. ఇక్కడ మూడా లేక నాలుగా అనే సందేహంలో, మూడు రకాతులు అనేది ఖచ్చితమైన విషయం. కనుక అతడు నాలుగవ రకాతు చదివి చివరన నమాజును సలాం తో ముగించడానికి ముందు రెండు సజ్దాలు (సుజూద్ అస్’సహ్వ్) చేయాలి. ఒకవేళ అతడు వాస్తవములో నాలుగు రకాతులు చదివి ఉంటే, అదనంగా చదివిన ఒక రకాతుతో మొత్తం ఐదు రకాతులు అవుతాయి. నమాజు చివరన, సలాంతో నమాజును ముగించడానికి ముందు చేసిన రెండు అదనపు సజ్దాలు ఒక రకాతుగా పరిగణించబడతాయి. ఆ విధంగా నమాజులో రకాతుల సంఖ్య బేసి, కాకుండా సరి సంఖ్య అవుతుంది. ఒకవేళ అతడు వాస్తవములో నాలుగు రకాతులే చదివి ఉంటే అతడు నమాజును ఆచరించవలసిన విధంగానే, ఎక్కువ తక్కువ లేకుండా ఆచరించాడన్నమాట. ఆ స్థితిలో, సలాంతో నమాజును ముగించడానికి ముందు చేసిన రెండు అదనపు సజ్దాలు (సుజూద్ అస్’సహ్వ్) షైతానుకు పరాభవంగా మారుతాయి, ఆ రెండు సజ్దాలు అతడిని పరాభవంతో, అతడి లక్ష్యం నుండి అతడిని దూరంగా తరిమివేస్తాయి. ఎందుకంటే అతడు అల్లాహ్ యొక్క దాసుడిని నమాజు’లో అయోమయానికి గురిచేసి, అతని నమాజు భంగపడేలా చేయాలని యోచించినాడు. కానీ అల్లాహ్ ఆదేశాలకు విధేయుడై ఆదమ్ కుమారుడు రెండు సజ్దాలు చేస్తూ, షైతానుకు (అతని ప్రభావానికి) అవిధేయత చూపినప్పుడు అతని నమాజు పరిపూర్ణమయ్యింది. అదే షైతాను – ఆదమ్ (అలైహిస్సలాం) కు సజ్దా చేయమని అల్లాహ్ ఆదేశించినపుడు అల్లాహ్ ఆదేశాన్ని తిరస్కరించి అవిధేయుడైనాడు.

فوائد الحديث

ఒక వ్యక్తి తన నమాజు గురించి సందేహంలో ఉంటే, మరియు రెండు విషయాలలో ఏది వాస్తవమైనదో ఖచ్చితంగా తెలియకపోతే, అతను తన సందేహాన్ని విస్మరించి, ఖచ్చితమైనదిగా భావించిన దానిపై అమలుచేయాలి; నిశ్చయంగా ఇది తక్కువ సంఖ్యయే అవుతుంది. ఆ విధంగా అతడు తన నమాజును పూర్తి చేసి, సలాం చెప్పే ముందు రెండు సజ్దాలు (సజ్దహ్ అస్’సహ్వ్) చేయాలి, అపుడు సలాంతో నమాజును ముగించాలి.

ఈ రెండు సజ్దాలు నమాజు యొక్క పరిపూర్ణతకు, మరియు షైతాన్’ను పరాభవంతో అతడి లక్ష్యం నుండి అతడిని దూరంగా తరిమివేయడానికి ఒక మార్గం.

ఈ హదీసులో ప్రస్తావించబడిన సందేహం లేక అనుమానం ఏదైతే ఉందో అది వాస్తవానికి ‘ఖచ్చితత్వం లేని’ ఒక అయోమయ స్థితి. కనుక అటువంటి స్థితిలో పడిపోతే, ఖచ్చితత్వానికి దగ్గరగా ఉన్న దానిపై అమలు చేయాలి.

అలాగే ఈ హదీసులో సందేహాలను, అనుమానాలను షరియత్ (లో అల్లాహ్ యొక్క) ఆదేశాలను పాటించడం ద్వారా దూరం చేసుకోవాలి అనే హితబోధ ఉన్నది.

التصنيفات

సహూ సజదాలు,తిలావత్ సజదాలు,కృతజ్ఞత సజదాలు