“ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో,…

“ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”

[దృఢమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపిస్తున్నారు: ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నమాజు ఆచరిస్తాడో, అలా ఆచరించడాన్ని అతడు ఒక విధానంగా అతడు నిరంతరం నిర్వహిస్తాడో, అల్లాహ్ అతడిని నరకాగ్ని నుండి రక్షిస్తాడు.

فوائد الحديث

జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు మరియు దాని తరువాత నాలు రకాతుల స్వచ్ఛంద నమాజు ఆచరించుట అభిలషణీయము.

“అర్-రవాతిబ్ అల్-ఖబ్లీయహ్” నమాజులను – అంటే “ఫర్జ్ నమాజుకు ముందు ఆచరించు స్వచ్ఛంద నమాజులు” – ఆచరించుట వెనుక గమనించవలసిన వివేకవంతమైన విషయాలున్నాయి, వాటిలో: ఒకటి అవి ‘ఫర్జ్ నమాజు” లోనికి ప్రవేశించే ముందు ఆరాధకుడి ఆత్మను ఆరాధనకు సిద్ధం చేయడం. అలాగే “అర్-రవాతిబ్ అల్ బా’దీయహ్” - అంటే “ఫర్జ్ నమాజు తరువాత ఆచరించు స్వచ్ఛంద నమాజులు” – విషయంలో గమనించినట్లయితే అవి ఫర్జ్ నమాజు ఆచరించుటలో ఏవైనా లోపాలు దొర్లినట్లయితే వాటిని భర్తీ చేయడం.

ఈ “అర్-రవాతిబ్” స్వచ్ఛంద నమాజులను ఆచరించుటలో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి: వాటిని ఆచరించుట “హసనాత్” (సత్కార్యములు‌) గా భావించబడుతుంది, కనుక వాటిని ఆచరించిన వాని మంచిపనులలో వృద్ధి నమోదు చేయబడుతుంది, అలాగే అవి అతని వల్ల జరిగిన చెడుపనులకు పరిహారంగా మారుతాయి; మరియు (తీర్పు దినమునాడు) అతని స్థాయిలో వృధ్ధి కలుగుతుంది.

ఈ హదీథులో ఉన్నట్లుగా ‘దైవిక వాగ్దానం’ (అతడు నరకం నుండి రక్షించబడతాడు అనే లాంటి వాగ్దానాలు) కలిగిన హదీథులకు సంబంధించి అహ్లుస్ సున్నత్ యొక్క ప్రాథమిక నియమం ఏమిటంటే: అవి తౌహీద్ (ఏకదైవత్వం) పై మరణించే వారికి వర్తిస్తాయని అర్థం చేసుకోవాలి. దీని అర్థం ఏమిటంటే, ఏకదైవారాధకులలో పాపపు పనులకు పాల్బడే వాడు శిక్షకు అర్హుడు, కానీ తీర్పు దినమునాడు అతడు శిక్షించబడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోయేలా నరకాగ్నిలో వేయబడడు. శిక్షాకాలం పూర్తి అయిన తరువాత అతడు అందునుండి బయటకు తీయబడతాడు. కనుక అటువంటి వారు ఎల్లప్పుడూ నరకాగ్నిలో ఉండిపోరు.

التصنيفات

అస్సుననుర్రవాతిబ్