إعدادات العرض
మీరు ఆమెను మూడు సార్లు లేక ఐదు సార్లు లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువసార్లు నీటితో మరియు సిద్ర్ తో (రేగిపండు…
మీరు ఆమెను మూడు సార్లు లేక ఐదు సార్లు లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువసార్లు నీటితో మరియు సిద్ర్ తో (రేగిపండు ఆకులతో చేసిన మిశ్రమం) బాగా కడగండి. చివరిసారి కడిగేటప్పుడు కాఫూర్ లేదా కాఫూర్ లో నుండి కొంతభాగాన్ని ఉపయోగించండి’ మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి
ఉమ్మ అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ యొక్క కుమార్తెలలో ఒకరు మరణించారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ బయటకు వచ్చి (అక్కడి స్త్రీల వద్దకు వచ్చి) ఇలా అన్నారు: «మీరు ఆమెను మూడు సార్లు లేక ఐదు సార్లు లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువసార్లు నీటితో మరియు సిద్ర్ తో (రేగిపండు ఆకులతో చేసిన మిశ్రమం) బాగా కడగండి. చివరిసారి కడిగేటప్పుడు కాఫూర్ లేదా కాఫూర్ లో నుండి కొంతభాగాన్ని ఉపయోగించండి’ మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి», మేము ముగించిన తరువాత ఆయనకు తెలిపినాము, అపుడు ఆయన తన వస్త్రాన్ని మాకు ఇచ్చి, దాన్ని ఆమె శరీరానికి చుట్టమని చెప్పారు. మరియు ఆమె ఇంకా ఇలా అన్నారు, 'మేము ఆమె తలవెంట్రుకలను మూడు జడలుగా చేశాము'.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt ئۇيغۇرچە Hausa Português മലയാളം Kurdî دری Македонски Magyar ქართული ไทย অসমীয়া ગુજરાતી Nederlands Kiswahili ਪੰਜਾਬੀ ភាសាខ្មែរ සිංහල मराठी ಕನ್ನಡ Српскиالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆమెకు గుసుల్ చేయించే స్త్రీల వద్దకు వచ్చి ఇలా చెప్పారు: "ఆమెకు నీటితో’ రేగుఆకులతో బేసి సంఖ్యలో మూడు సార్లు, లేదా ఐదు సార్లు, లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు గుసుల్ చేయించండి. చివరి గుసుల్ లో కొంచం కాఫూర్ ను ఉపయోగించండి. మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి. ఆమెకు గుసుల్ చేయించడం పూర్తి చేసిన తర్వాత, వారు ఆయనకు తెలుపగా, ఆయన గుసుల్ చేయించిన మహిళలకు తన ఇజార్ ను ఇచ్చి, ఇలా అన్నారు: ‘ఆమెను దీనిలో చుట్టండి, దీనినే ఆమె శరీరానికి తగిలి ఉండే వస్త్రంగా చేయండి’. ఆ తర్వాత, ఆమె జుట్టును మూడు జడలుగా అల్లారు.فوائد الحديث
ముస్లిం మృతదేహానికి గుసుల్ చేయటం అనివార్యము మరియు అది ఫర్జె కిఫాయ (సామూహిక బాధ్యత).
మహిళల మృతదేహానికి మహిళలు మాత్రమే స్నానం చేయించాలి, మరియు పురుషుడి మృతదేహానికి పురుషులు మాత్రమే స్నానం చేయించాలి. అయితే, భార్య విషయంలో భర్తకు, మరియు భర్త విషయంలో భార్యకు మినహాయింపు ఉంది. అలాగే (గత కాలంలో) బానిస స్త్రీ విషయంలో ఆమె యజమానికి (మరియు యజమాని విషయంలో ఆమెకు) మినహాయింపు ఉంది. వీరిద్దరిలో ప్రతి ఒక్కరు తోటివాని మృతదేహానిక స్నానం చేయించవచ్చు.
"మృతదేహాన్ని మూడుసార్లు కడగాలి. ఒకవేళ అది సరిపోకపోతే, ఐదుసార్లు కడగాలి. అది కూడా సరిపోకపోతే, అవసరం మరియు ప్రయోజనం ప్రకారం, దాని కంటే ఎక్కువ సార్లు కడగవచ్చు. ఆ తర్వాత, మృతదేహం నుండి ఏదైనా అపవిత్రత (నజాసత్) బయటకు వస్తే, ఆ అపవిత్రత వచ్చే స్థలాన్ని మూసివేయాలి."
గుసుల్ చేయించే వ్యక్తి మృతదేహం కడగడాన్ని బేసి సంఖ్యలో ముగించాలి, అంటే మూడు, ఐదు, లేదా ఏడు సార్లు.
అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథు మృతునికి స్నానం చేయించడంలో (ఎన్ని సార్లు కడగాలి అనే దానిపై) ఎటువంటి నిర్దిష్ట పరిమితి లేదని సూచిస్తుంది, బదులుగా, శుభ్రపరచడమే అసలు ఉద్దేశ్యం. అయితే, బేసి సంఖ్యను పాటించడం తప్పనిసరి.
నీటితో పాటు రేగి ఆకులు ఉండాలి; ఎందుకంటే అది మృతదేహాన్ని శుభ్రపరుస్తుంది, మరియు మృతదేహాన్ని గట్టి పరుస్తుంది.
మృతదేహానికి చివరి స్నానంతో పాటు సుగంధ ద్రవ్యం పూయాలి, తద్వారా నీరు దానిని తొలగించదు. ఆ సుగంధ ద్రవ్యం కాఫూర్ అయి ఉండాలి, ఎందుకంటే అది - దాని మంచి సువాసనతో పాటు - శరీరాన్ని గట్టిపరుస్తుంది, అందువల్ల అది త్వరగా కుళ్ళిపోదు.
మొదట శ్రేష్ఠమైన అవయవాలను కడగటం, అవి: కుడి వైపు అవయవాలు, మరియు ఉదూ అవయవాలు.
మృతురాలి జుట్టును దువ్వి, మూడు జడలుగా అల్లి, వాటిని ఆమె వెనుక ఉంచడం సిఫార్సు చేయబడినది.
మృతునికి స్నానం చేయించడంలో సహకరించుకోవచ్చు, కానీ అవసరమైన వారు తప్ప మరెవరూ హాజరు కాకూడదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వస్త్రాల వంటి ఆయన వస్తువుల ద్వారా శుభం (బరకత్) పొందటం అనేది ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన విషయం. దీనిని ఆయనను దాటి ఇతర ఉలమాలు (పండితులు) మరియు సత్పురుషులకు వర్తింపజేయరాదు. ఎందుకంటే ఈ విషయాలు కేవలం దైవిక ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి, మరియు సహచరులు ఆయనతో తప్ప మరెవరితోనూ ఎన్నడూ ఇలా చేయలేదు. అంతేకాక, ఇతరుల విషయంలో ఇది షిర్క్‌కు దారి తీసే ఒక మాధ్యమం మరియు ఎవరి ద్వారా అయితే శుభం ఆశించబడుతుందో వారికి ఒక ఫిత్నహ్ (పరీక్ష) కూడా.
ఒక విశ్వసనీయ వ్యక్తి ఆ బాధ్యతకు అర్హుడు అయితే, అతడు తనకు అప్పగించబడిన పనిలో ఇతరుల సహాయం తీసుకోవడానికి పంచుకోవడానికి అతడికి అనుమతి ఉంది.
التصنيفات
మృతునికి స్నానం చేయించడం.