అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే…

అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.”

అబూ మూసా అల్ అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : నేను, కొంతమంది అష్’అరీ తెగ వారితో కలిసి, “మాకు సవారీ వాహనాలు (ఉదా: ఒంటెలు, గుర్రాలు మొ.) కావాలి” అని కోరుతూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినాము. ఆయన “అల్లాహ్ సాక్షిగా! మీరు సవారీ అయి వెళ్ళడానికి నేను ఏమీ ఇవ్వను, మిమ్ములను సవారీ చేయడానికి నావద్ద ఏమీ లేదు” అన్నారు. అల్లాహ్ కోరినంత కాలము మేము ఎదురు చూసాము. అపుడు వారి వద్దకు మూడు ఒంటెలు తీసుకురాబడినాయి. ఆ మూడు ఒంటెలను తీసుకు వెళ్ళమని ఆయన మమ్మల్ని ఆదేశించినారు. మేము వాటిని తీసుకుని వెళ్ళినాము. అపుడు మాలో కొందరు “అల్లాహ్ మనలను అనుగ్రహించడు, మనం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, మనకు సవారీ సమకూర్చమని కోరినాము. కానీ ఆయన అల్లాహ్ పై ప్రమాణం చేసి మరీ మనకు సవారీ ఇవ్వను అని అన్నారు; కానీ తరువాత ఇచ్చినారు” అన్నారు. అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చి (మా మధ్య) జరిగిన విషయాన్ని వారికి తెలియజేసినాము. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకు సవారీలను నేను సమకూర్చలేదు; కానీ అల్లాహ్ సమకూర్చినాడు. అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో అబూ మూసా అల్ అష్’అరీ రదియల్లాహు అన్హు తాను తన తెగకు చెందిన మరి కొంతమందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినానని ఉల్లేఖిస్తున్నారు. వారి ఉద్దేశ్యం జిహాద్’లో పాల్గొనడానికి స్వారీ వాహనాలుగా తమకు ఒంటెలను సమకూర్చమని వారిని కోరడం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వారీ వాహనాలను సమకూర్చను అని అల్లాహ్ పై ప్రమాణం చేసి చెప్పి, వారికి ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదు అని అన్నారు. అపుడు వారు కొద్దికాలం వేచి ఉన్నారు, అప్పుడు మూడు ఒంటెలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాయి; ఆయన వాటిని వారి వద్దకు పంపారు. వారిలో కొందరు ఒకరితో ఒకరు ఇలా అన్నారు: “ఈ ఒంటెల ద్వారా అల్లాహ్ మనలను అనుగ్రహించడు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని అల్లాహ్ పై ప్రమాణం చేసి మనకు వాహనాలను సమకూర్చను అని అన్నారు”. దానితో వారందరూ ఆయన వద్దకు వచ్చి తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన వద్ద ప్రస్తావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీకు వాహనాలను సమకూర్చినది సర్వోన్నతుడైన అల్లాహ్ మాత్రమే. ఎందుకంటే సహాయాన్ని మరియు ఉపాధిని కల్పించే (మరియు కల్పించే వాడు) ఆయనే, నా చేతుల ద్వారా ఇది జరగడానికి నేను ఒక కారణాన్ని మాత్రమే. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను - అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – నేను ఏదైనా విషయం కొరకు, చేయడానికి గానీ లేక వదిలివేయడానికి గానీ ప్రమాణం చేస్తే, తరువాత నేను ప్రమాణం చేసిన దాని కంటే వేరొక విషయాన్ని మంచిదిగా, శుభప్రరదమైనదిగా నేను చూసినట్లయితే, నేను ఆ శుభప్రదమైన విషయాన్నే ఎంచుకుంటాను, నేను ముందు ప్రమాణం చేసిన విషయాన్ని వదిలివేసి, అందుకు గానూ పరిహారం చెల్లిస్తాను.”

فوائد الحديث

ఎదుటి వ్యక్తి అడగకపోయినా, విషయపు ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికి, ప్రమాణం చేసి మరీ చెప్పవచ్చు అనడానికి ఇందులో ఆధారం ఉన్నది.

ప్రమాణం చేసిన తర్వాత “ఇన్ షా అల్లాహ్” ("అల్లాహ్ కోరుకుంటే") అని చెప్పడం ద్వారా మినహాయింపు ఇవ్వడం అనుమతించబడిన విషయమే. ఆ మినహాయింపు, చేసిన ప్రమాణానికి చెందినది అయి ఉండి, దానికి అనుసంధానించబడి ఉంటే, తన ప్రమాణాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం లేదు (పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు).

అలాగే ఈ హదీసులో, ప్రమాణం చేసిన వ్యక్తి, ఒకవేళ అతడు తాను ప్రమాణం చేసిన దాని కంటే మెరుగైన దానిని చూసినట్లయితే, ఆ మెరుగైన విషయం కొరకు, చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించవచ్చు అనే ప్రోత్సాహం ఉన్నది. అయితే ఆ వ్యకి, ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకు పరిహారం చెల్లించాలి.

التصنيفات

ప్రమాణాలు మరియు మొక్కుబడులు