ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల…

ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి." దానికి సాలిమ్ ఇలా చెప్పినారు: అబూ హురైరా రదియల్లాహు అన్హు వద్ద ఒక పొలం ఉండేది, అతను ఇలా చెప్పేవారు: "లేదా పొలం కాపాడే కుక్క అయితే కూడా (వ్యతిరేకం లేదు)."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: "వేట కోసం, పశువులను లేదా పంటలను కాపాడే అవసరం కోసం తప్ప, ఇతర కారణాల కోసం కుక్కను పెంచడం నిషిద్ధం. ఇతర ఉద్దేశాల కోసం కుక్కను పెంచినవారి సత్కార్యాల నుంచి ప్రతిరోజూ రెండు ఖీరాతులు (దాని పరిమాణం కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు) తగ్గిపోతాయి.

فوائد الحديث

ముస్లిం వ్యక్తి కొరకు పైన మినహాయించబడిన కొన్ని సందర్భాలలో తప్ప, కుక్కను పెంచడం అనుమతించబడలేదు.

కుక్కలను పెంచడంలో అనేక హానికరమైన మరియు చెడు పరిణామాలు ఉన్నందున అది నిషిద్ధం. "దైవదూతలు కుక్క ఉన్న ఇంట్లోకి ప్రవేశించరు" అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విశ్వసనీయంగా నమోదు చేయబడింది. ఇంకా అదనంగా, కుక్కలు తీవ్రమైన అపవిత్రతను (నజాసత్) కలిగి ఉంటాయి; దానిని పూర్తిగా తొలగించాలంటే, నీటితో మరియు మట్టితో పలుమార్లు కడగ వలసి ఉంటుంది.

التصنيفات

వేటాడటం