ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా…

ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)

ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)

[దృఢమైనది]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ము’ఆద్ (రదియల్లాహు అన్హు) చేతిని పట్టుకుని “అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను, ప్రతి సలాహ్ తరువాత ఈ పదాలు పలుకకుండా ఎప్పుడూ ఉండవద్దు: (అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక) ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి – నీ విధేయతకు దగ్గర చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో (నాకు సహాయం చేయి) (వ షుక్రిక) నీకు కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి – శుభాలు పొందడం మరియు విపత్తులను త్రిప్పికొట్టడం ద్వారా (కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి), (వ హుస్ని ఇబాదతిక్) నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి - అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో ఉండడం ద్వారా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించడం ద్వారా (ఉత్తమంగా ఆరాధించుటకు సహాయం చేయి).

فوائد الحديث

ఒక వ్యక్తి పట్ల మన ప్రేమ కేవలం అల్లాహ్ కొరకే అని అతనికి తెలియజేయుట షరియత్ ప్రకారం సరియైనదే.

ఈ దుఆను ప్రతి ఫర్జ్ నమాజు తరువాత మరియు ప్రతి సున్నత్, నఫీల్ నమాజుల తరువాత పఠించుట అభిలషణీయము.

ఈ దుఆలో కొద్ది పదాలలోనే ఈ ప్రాపంచిక మరియు పరలోక జీవితాలకు సంబంధించిన అభ్యర్థనలు ఉన్నాయి.

అల్లాహ్ కొరకు మాత్రమే ప్రేమ కలిగి ఉండుట యొక్క ప్రయోజనాలలో ఒకరినొకరు సత్యాన్ని అనుసరించమని హెచ్చరించుకొనుట, ఒకరితోనొకరు ఉపయుక్తమైన సలహాలూ, సంప్రదింపులూ జరుపుట, ధర్మబధ్ధత మరియు దైవభీతిలో సహకరించుకొనుట ఉన్నాయి.

అల్-తయ్యిబి ఇలా అన్నారు: అల్లాహ్ స్మరణ అనేది హృదయ విస్తారణకు నాంది; ఆయన ప్రసాదించిన శుభాలే ఆయనకు కృతఙ్ఞతలు తెలుపుకోవడానికి సాధనం; మరియు ఉత్తమమైన ఆరాధనకు అవసరమైనది ఏమిటంటే సర్వోన్నతుడైన అల్లాహ్ నుండి దూరం చేసే వాటి నుండి విముక్తి పొందడం, వాటికి దూరంగా ఉండడం.

التصنيفات

నమాజ్ దఆలు