మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా…

మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో”. ఎపుడైతే అతడు నిద్ర నుండి లేచి అల్లాహ్ పేరును స్మరిస్తాడో ఒక ముడి విడి పోతుంది; ఎపుడైతే అతడు ఉదూ చేస్తాడో మరొక ముడి విడిపోతుంది; (ఉదూ చేసిన తరువాత) ఎపుడైతే అతడు నమాజును ఆచరిస్తాడో చివరి ముడి విడి పోతుంది. మరియు అతడు ఉదయం చురుకైన ఆత్మతో, ఉల్లాసంగా లేస్తాడు; లేకుంటే ఉదయం దౌర్భాగ్యపూరితంగా, నిరుత్సాహంగా, సొమరితనంతో లేస్తాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి (తహజ్జుద్) నమాజు కొరకు, లేదా ఫజ్ర్ నమాజు కొరకు లేవాలి అనుకునే వ్యక్తిపై షైతాను చేసే దాడి గురించి తెలియజేస్తున్నారు. ఒక విశ్వాసి నిద్రకు ఉపక్రమించినపుడు, షైతాను అతని మెడ భాగంలో మూడు ముడులు వేస్తాడు. మెడ భాగములో అంటే తలవెనుక భాగములో అని అర్థము షైతాను గుసగుసలకు ప్రతిస్పందించక, విశ్వాసి నిద్ర నుండి మేల్కొని అల్లాహ్’ను స్మరించుకుంటే ఒక ముడి తొలగి పోతుంది. అతడు ఉదూ చేసుకుంటే రెండవ ముడి తొలగిపోతుంది. అతను లేచి నమాజు ఆచరిస్తే చేస్తే, మూడవ ముడి విడిపోతుంది. షైతాను వేసిన ముడుల కారణంగా అతడిని ఆవరించి ఉన్న నిరుత్సాహము తొలగి పోవడంతో, అతను చురుకుగా మరియు మంచి మానసిక స్థితిలో ఉంటాడు, ఎందుకంటే అల్లాహ్ తనకు ప్రసాదించిన విధేయతతో అతను సంతోషంగా ఉన్నాడు గనుక, మరియు అల్లాహ్ అతనికి ప్రతిఫలం గురించి మరియు క్షమాపణ గురించి వాగ్దానం చేసిన దాని పట్ల ఆశాజనకంగా ఉన్నాడు గనుక.

فوائد الحديث

మనిషి కొరకు షైతాను తనకు వీలైన ప్రతి మార్గములో అహర్నిశలూ ప్రయత్నిస్తూనే ఉంటాడు – అతనికీ, సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ పట్ల అతని విధేయతకూ మధ్య అడ్డు రావడానికి. షైతాను నుండి తప్పించుకోవడానికి సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సహాయాన్నీ కోరడం, అల్లాహ్ శరణు కోరడం, తద్వారా నివారణ మరియు సంరక్షణ మార్గాలను తీసుకోవడం తప్ప అతనికి మరో మార్గాంతరం లేదు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణ మరియు ఆయన ఆరాధన ఆత్మలో చురుకుదనాన్ని, మరియు హృదయంలో విశాలతను కలిగిస్తుంది. సోమరితనాన్ని, బద్ధకాన్ని తొలగిస్తుంది. చింతను, దుఃఖాన్ని మరియు ద్వేషాన్ని తొలగిస్తుంది. ఎందుకంటే ఇది షైతానును దూరం చేస్తుంది. ఈ అవలక్షణాలన్నీ షైతాను కల్పించే పరిపరివిధాల ఆలోచనలు మరియు అతని గుసగుసల కారణంగానే.

(వీటన్నింటినీ అధిగమించి) అల్లాహ్ సమక్షములో విధేయునిగా నిలబడుటలో అల్లాహ్ తనకు ప్రసాదించిన విజయము పట్ల విశ్వాసి సంతోషపడతాడు. కానీ, ధర్మనిష్ఠత మరియు పరిపూర్ణత స్థాయిలలో అతడు తనలోని లోపాల కారణంగా విచారంలో పడిపోతాడు, వ్యాకులపడతాడు.

అశ్రద్ధ, అలక్ష్యము, లెక్కలేనితనం, మరియు అల్లాహ్ యొక్క విధేయత పట్ల అయిష్టత అనేవి షైతాను యొక్క చర్యలలోనివి, మరియు ఇవి షైతాను యొక్క అలంకారాలు, ఆభరణాలు.

ఈ మూడు విషయాలు – అల్లాహ్ యొక్క స్మరణ, ఉదూ చేయుట మరియు సలాహ్ (నమాజు) చేయుట – షైతానును దూరంగా పారదోలుతాయి.

షైతాను యొక్క ముడులు ప్రత్యేకంగా తల వెనుక భాగంలో ఉంటాయి, ఎందుకంటే ఇది శక్తి యొక్క కేంద్రము, మరియు షైతాను చర్య యొక్క క్షేత్రము. అతడు ఆ ముడులను వేసినట్లైతే, అతడు మానవుని ఆత్మను నియంత్రించగలడు, అతడు నిద్రపోయేలా చేయగలడు.

ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదాలలో “అలైక లైలున్ తవీలున్...” (రాత్రి ఇంకా ఉంది...) అనే మాటలు ఇది రాత్రి నిద్రకు ప్రత్యేకమని తెలియజేస్తున్నాయి.

ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ సందర్భములో అల్లాహ్’ను స్మరించుట కొరకు ప్రత్యేకంగా నిర్దేశించబడిన నిర్దిష్ట విషయం ఏదీ లేదు, అది తప్ప మరింకేదీ సరిపోదు అనుటకు. వాస్తవానికి, అల్లాహ్ యొక్క స్మరణలో సత్యమైన ప్రతిదీ సరిపోతుంది; అందులో ఖుర్ఆన్ పఠించడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు చదవడం మరియు ఇస్లామీయ జ్ఞానంలో నిమగ్నమవడం వంటివి ఉన్నాయి. అయితే మిగతా వాటన్నింటి కంటే ఉత్తమమైనది, ముందుగా గుర్తుంచు కోవలసిన విషయం ఏమిటంటే, నిద్ర నుండి మేల్కొను సందర్భానికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరైతే రాత్రి నిద్ర నుండి మేల్కొంటాడో అతడు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్’ముల్కు, వలహుల్’హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, అల్’హందులిల్లాహ్, వ సుబ్’హానల్లాహ్, వ లాఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, వలాహౌల, వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలికి, తరువాత “అల్లాహుమ్మగ్'ఫిర్లీ” అనో లేక మరింకేదైనా దుఆ చేస్తాడో, అతడి దుఆకు సమాధానం ఇవ్వబడుతుంది; అతడు ఉదూ చేసి సలాహ్ (నమాజు) ఆచరిస్తే, అతడి సలాహ్ స్వీకరించబడుతుంది.” ఈ హదీథును ఇమాం బుఖారీ (తన సహీహ్’లో) ఉల్లేఖించారు.

التصنيفات

వజూ ప్రాముఖ్యత, అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు