అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు

అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు

1- “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి*, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.

2- “ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”*. మరియు (ఆ వ్యక్తి) ఇంటిలోనికి ప్రవేశిస్తే, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే షైతాను ఇలా అంటాడు “రాత్రి గడపాడానికి స్థలం దొరికింది”; మరియు (ఆ వ్యక్తి) భోజనం తినడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే, (షైతాను) ఇలా అంటాడు “రాత్రి గడపడానికి స్థలమూ మరియు భోజనమూ రెండూ దొరికాయి.”

3- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికినాడు: @ నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నేను అతడు భావించినట్లుగానే అతనితో ఉంటాను*; అతను తనలో తాను నన్ను స్మరించినప్పుడు నాలో నేను అతడిని స్మరిస్తాను; ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో స్మరించినట్లయితే, అంతకంటే ఉత్తమమైన సమావేశములో నేను అతడిని ప్రస్తావిస్తాను; ఒకవేళ అతడు ఒక ‘షిబ్ర్’ అంత (జానెడంత) నాకు చేరువ అయితే, నేను ఒక ‘దిరా’ అంత (ఒక మూరెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు ఒక ‘దిరా’ అంత నాకు చేరువ అయితే, నేను ఒక “బాఅ” అంత (ఒక బారెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు నా వైపు నడుచుకుంటూ వస్తే, నేను అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాను.”

4- "మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో*”. ఎపుడైతే అతడు నిద్ర నుండి లేచి అల్లాహ్ పేరును స్మరిస్తాడో ఒక ముడి విడి పోతుంది; ఎపుడైతే అతడు ఉదూ చేస్తాడో మరొక ముడి విడిపోతుంది; (ఉదూ చేసిన తరువాత) ఎపుడైతే అతడు నమాజును ఆచరిస్తాడో చివరి ముడి విడి పోతుంది. మరియు అతడు ఉదయం చురుకైన ఆత్మతో, ఉల్లాసంగా లేస్తాడు; లేకుంటే ఉదయం దౌర్భాగ్యపూరితంగా, నిరుత్సాహంగా, సొమరితనంతో లేస్తాడు.”

9- "ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ* ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"