“నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని,…

“నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

కాబ్ బిన్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను స్మరించడానికి పలుకవలసిన కొన్ని పదాలను గురించి తెలియజేసారు. వాటిని ఉచ్ఛరించే వాడు ఏమీ కోల్పోడు, మరియు దేనికీ చింతించడు; పైగా వాటిని ఉచ్ఛరించినందుకు అతడు ప్రతిఫలాన్ని పొందుతాడు. వాటిలో కొన్ని విషయాల తరువాత కొన్ని వస్తాయి. ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత ఉచ్చరించబడతాయి. అవి: “సుబ్’హానల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ పరమ పవిత్రుడు, లోపములకు, కొరతలకు అతీతుడు) “అల్’హదులిల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: సకల స్తోత్రములు, పొగడ్తలు కేవలం అల్లాహ్ కొరకే అని, అంటే ఇందులో అల్లాహ్‌ను పూర్తి పరిపూర్ణతతో వర్ణించడంతో పాటు ఆయనను ప్రేమించడం మరియు కీర్తించడం అన్నీ కలిసి ఉంటాయి) “అల్లాహు అక్బర్” అని ముప్పైనాలుగు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ అందరి కంటే, అన్నిటి కంటే గొప్పవాడు, మహోన్నతుడు, మరియు అన్నింటికన్నా శక్తివంతమైనవాడు)

فوائد الحديث

ఈ హదీసులో తస్బీహ్ (‘సుబ్’హానల్లాహ్’ - అల్లాహ్‌ను మహిమపరచడం), తహ్మీద్ (‘అల్’హందులిల్లాహ్’ - అల్లాహ్‌ను స్తుతించడం), మరియు తక్బీర్ (‘అల్లాహు అక్బర్’ - అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం) – ఈ స్తుతి పదాల యొక్క యోగ్యత, ఘనత తెలుస్తున్నాయి; అవి శాశ్వతత్వం కలిగిన సదాచరణలు.

التصنيفات

నమాజ్ దఆలు, అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు