“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది,…

“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి

అబీ మాలిక్ అష్’అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు తెలియజేస్తున్నారు: భౌతిక పరిశుద్ధత వుదూ మరియు గుసుల్ ఆచరించుట ద్వారా లభించును. నమాజు కొరకు వుదూ చేసి ఉండుట ఒక షరతు. ‘అల్-హందులిల్లాహ్’ అని పలుకుట అంటే ‘సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కే చెందుతాయి’ అని పలుకుట మరియు అల్లాహ్ ను అత్యంత పరిపూర్ణమైన గుణగణాలతో, లక్షణాలతో కీర్తించుట – తీర్పు దినము నాడు సత్కర్మల త్రాసులో తూచబడుతుంది మరియు అది సత్కర్మల త్రాసును నింపివేస్తుంది. మరియు ‘సుబ్’హానల్లాహి వల్’హందులిల్లాహి’ (అల్లాహ్ పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు ఆయనకే చెందుతాయి) అని ఈ రెండు పదాలను కలిపి ఉచ్ఛరించుట భూమ్యాకాశాల మధ్యన ఉన్న అంతటినీ నింపివేస్తుంది. అలాగే ‘నమాజు కాంతి’, అంటే అది అతని హృదయములో కాంతి, అతని ముఖములో కాంతి, అతని సమాధిలో కాంతి అలాగే తీర్పు దినమున అది అతని కొరకు కాంతి అని అర్థము. ఇంకా ‘దానము చేయుట ఒక సాక్ష్యము’ అంటే దానము చేయుట అనే గుణము ఇస్లాంలో అతని విశ్వాసములో అతనియొక్క నిజాయితీ, నిష్కపటత్వము లకు నిదర్శనం. ఈ గుణము కపట విశ్వాసిలో కనపడదు. ఎందుకంటే దానగుణమును అలవర్చుకునే వారికి ఇస్లాం చేసే వాగ్దానములలో కపట విశ్వాసికి నమ్మకం ఉండదు. మరియు ‘సహనము వెలుగు’ – అంటే దైనందిన జీవితములో ఎదురయ్యే చింత, వేదన, వ్యాకులత, కోపము, విద్వేషము, శత్రుత్వము మొదలైన వాటి నుండి తనను తాను ఆపుకొనుట, సహనము వహించుట. వెలుగు అనేది , సూర్యకాంతి వలే తనతో పాటు మంటను వేడినీ తీసుకుని వస్తుంది. సహనం వహించుట అనేది చాలా కష్టమైనది. ఎందుకంటే అందులో స్వయంతో పోరాటం, స్వీయ ఆత్మతో పోరాటం ఉంటాయి. ఆత్మ ఉత్తేజ పరిచే కోరికల నుండి తనను తాను బందీ చేసుకోవలసి ఉంటుంది. అందుకనే సహనం వహించే వ్యక్తి ఎప్పుడూ వెలుగును కలిగి ఉంటాడు, మార్గదర్శనం కలిగి ఉంటాడు, మరియు ఎల్లప్పుడూ సత్యము పై ఉంటాడు. అలాగే అతడు అల్లాహ్ యొక్క విధేయతకు సంబంధించిన విషయాలలో సహనం కలిగి ఉంటాడు. అల్లాహ్ యొక్క అవిధేయతకు దారి తీసే విషయాల పట్ల సహనం కలిగి ఉంటాడు. విధిలిఖితం, పూర్వనిర్దిష్టం వలన కలిగే కష్టాలు, బాధల పట్ల సహనం కలిగి ఉంటాడు. మరియు ఖుర్’ఆన్ నీ పక్షమున ఒక సాక్షి, దానిని అనుదినము పఠిస్తూ దానిపై ఆచరిస్తూ ఉన్నట్లయితే; అలాగే ఖుర్’ఆన్ నీకు వ్యతిరేకంగా ఒక సాక్షి, ఒకవేళ దాని పారాయణం చేయకుండా మరియు దానిపై ఆచరించకుండా వదిలి వేసినట్లయితే. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు ప్రతిరోజూ ఉదయమే తమ నిద్రల నుండి లేస్తారు, ఉరుకులు పరుగులతో తమతమ ఇళ్ళను వదిలి తమతమ పనల కొరకు బయలుదేరుతారు అని తెలియజెసారు. వారిలో కొంతమంది అల్లాహ్ యొక్క విధేయతలో నిజాయితీ కలిగి ఉంటారు, ఆయన విధేయతలో పటిష్ఠంగా నిలబదతారు. వారు తమను తాము నరకాగ్ని నుండి రక్షించుకుంటారు. మరి కొందరు సత్యమార్గము నుండి వైదొలగి అల్లాహ్ యొక్క అవిధేయతలో పడిపోతారు, తమను తాము నాశనం చేసుకుని నరకాగ్నిలో పడిపోతారు.

فوائد الحديث

పరిశుద్ధత రెండు రకాలు. భౌతిక పరిశుద్ధత, ఇది వుదూ చేయుట ద్వారా మరియు గుసుల్ చేయుట ద్వారా లభిస్తుంది. మరియు అంతరంగ పరిశుద్ధత – ఇది తౌహీద్, అచంచలమైన విశ్వాసము మరియు సత్కార్యములు ఆచరించుట ద్వారా లభిస్తుంది.

ఇందులో సలాహ్ (నమాజు) యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది, అందుకంటే అది దాసుని ఇహలోక జీవితానికి మరియు పరలోక జీవితానికి కాంతి వంటిది.

దానగుణము దాసుని విశ్వాసము యొక్క నిజాయితీకి నిదర్శనము.

ఇందులో ఖుర్’ఆన్ యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది. ఖుర్’ఆన్ నందు విశ్వాసము మరియు దానిపై ఆచరించుట వలన ఖుర్’ఆన్ తీర్పు దినము నాడు దాసుని పక్షమున సాక్ష్యముగా నిలుస్తుంది, అతనికి వ్యతిరేకంగా కాదు.

దాసుడు తన ఆత్మను అల్లాహ్ యొక్క విధేయతలో నిమగ్నమై ఉండేలా చేయకపోతే, అది అతడిని అల్లాహ్ యొక్క అవిధేయతలో నిమగ్నుడిని చేస్తుంది.

ప్రతి మనిషీ తన జీవిక కొరకు తప్పనిసరిగా పని చేయాలి. అయితే, అతడు దాని ద్వారా ఈ ప్రాపంచిక ఆకర్షణలనుండి తన ఆత్మను స్వతంత్రించుకుని అల్లాహ్ యొక్క విధేయతలో గడుపుతాడు, లేక పాపకార్యములలో తనను తాను పడవేసుకుని శిక్షకు గురి అవుతాడు.

సహనం వహించడానికి - ఓర్పు, నిలకడ, అర్థం చేసుకునే శక్తి అవసరం అవుతాయి. సహనం వహించడం కష్టముతో కూడుకుని ఉన్న పని.

التصنيفات

విశ్వాసము యొక్క భాగాలు, అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు, మనస్సుల పరిశుద్ధత, వజూ ప్రాముఖ్యత, నమాజు ప్రాముఖ్యత