"ఎవరు ‘సుబహానల్లాహిల్-అజీమ్ వ బిహమ్'దిహి’ పరమ పవిత్రుడైన అల్లాహ్‌కు మహోన్నత మహిమ గలవాడు మరియు సకలస్తోత్రాలు,…

"ఎవరు ‘సుబహానల్లాహిల్-అజీమ్ వ బిహమ్'దిహి’ పరమ పవిత్రుడైన అల్లాహ్‌కు మహోన్నత మహిమ గలవాడు మరియు సకలస్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి) అని పలుకుతారో, అతడి కోసం స్వర్గంలో ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది."

జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరు ‘సుబహానల్లాహిల్-అజీమ్ వ బిహమ్'దిహి’ పరమ పవిత్రుడైన అల్లాహ్‌కు మహోన్నత మహిమ గలవాడు మరియు సకలస్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి) అని పలుకుతారో, అతడి కోసం స్వర్గంలో ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది."

[దృఢమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "సుబహానల్లాహ్" (అల్లాహ్ పరమ పవిత్రుడు), "అల్-అజీమ్" (అతను గొప్పవాడు, ఆయన అందరి కంటే, అన్నింటి కంటే మహోన్నతుడు —తన స్వరూపంలో, లక్షణాల్లో, క్రియల్లో), "వ బిహమ్దిహి" (సకల స్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే శోభిస్తాయి ఎందుకంటే పరిపూర్ణమైన గుణాలు ఆయనకే ఉన్నాయని అంగీకరించడం), ఎవరైతే ఇలా పలుకుతారో, అలా పలికిన ప్రతిసారి, స్వర్గ భూమిలో అతడి కోసం ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది.

فوائد الحديث

అల్లాహ్‌ను తరచుగా స్మరించడాన్ని ప్రోత్సహించడం మరియు అందులో అల్లాహ్‌ను స్మరించడంతో పాటు ఆయనను స్తుతించడం కూడా ఉంటుంది.

స్వర్గం చాలా విస్తృతమైనది. దానిలోని మొక్కలు, వృక్షాలు — తస్బీహ్ (అల్లాహ్‌ పరిశుద్ధతను కొనియాడటం), తహ్మీద్ (అల్లాహ్‌ ను స్తుతించడం) వలన ఏర్పడతాయి. ఇది మహోన్నతుడైన అల్లాహ్ కృప, దయ వలన ముస్లింలకు వరంగా లభిస్తుంది.

ఖర్జూర చెట్టును హదీథులలో ఇతర చెట్లతో పోలిస్తే ప్రత్యేకంగా ప్రస్తావించడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దాని ఫలానికి ఉన్న అనేక లాభాలు, మంచి గుణాలు వల్లే ఇది విశేషంగా ప్రస్తావించబడింది. అందుకే, ఖుర్ఆన్‌లో కూడా మహోన్నతుడైన అల్లాహ్ ఈ చెట్టును విశ్వాసికి మరియు అతని విశ్వాసానికి ఉపమానంగా ఉపయోగించినాడు.

التصنيفات

అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు