“ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని…

“ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను. “ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”. మరియు (ఆ వ్యక్తి) ఇంటిలోనికి ప్రవేశిస్తే, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే షైతాను ఇలా అంటాడు “రాత్రి గడపాడానికి స్థలం దొరికింది”; మరియు (ఆ వ్యక్తి) భోజనం తినడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే, (షైతాను) ఇలా అంటాడు “రాత్రి గడపడానికి స్థలమూ మరియు భోజనమూ రెండూ దొరికాయి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఇంటిలో ప్రవేశించడానికి ముందు మరియు భోజనం తినుట ప్రారంభించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించమని ఆదేశిస్తున్నారు. అల్లాహ్ పేరును స్మరించుట అంటే ఇంటిలో ప్రవేశించుటకు ముందు, మరియు భోజనం తినుట ప్రారంభించుటకు ముందు “బిస్మిల్లాహ్” అని పలుకుట. అపుడు షైతాను తన అనుచరులతో ఇలా అంటాడు: “మీకు ఈ ఇంటిలో రాత్రి గడిపే అవకాశం గానీ భోజనం చేసే అవకాశం గానీ లేవు; ఈ ఇంటి యజమాని అల్లాహ్ పేరును స్మరించుట ద్వారా మీనుండి తనను తాను రక్షించుకున్నాడు.” మరియు ఒకవేళ ఆ వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించినపుడు, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించకపోయినా, భోజనం తినుట ప్రారంభించడానికి ముందు అల్లహ్ పేరును స్మరించకపోయినా, షైతాను తన అనుచరులతో ఇలా అంటాడు: “ఈ ఇంటిలో రాత్రి గడపడానికి, భోజనం చేయడానికి అవకాశం దొరికింది.”

فوائد الحديث

ఇంటిలో ప్రవేశించడానికి ముందు మరియు ఆహారం తినుట ప్రారంభించడానికి ముందు అల్లాహ్ పేరు స్మరించుట అనేది అత్యంత అభిలషణీయమైన ఆచరణాలలో ఒకటి. సర్వోన్నతుడైన అల్లాహ్ పేరును స్మరించకపోతే షైతాను ఆ ఇళ్ళలో రాత్రి గడుపుతాడు ఆ ఇళ్ళలో నివసించే వారి ఆహారాన్ని తింటాడు.

ఆదాము కుమారుని ఆచరణలను, అతని వ్యవహారాలను, అతని ప్రవర్తనను షైతాను గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ అతడు అల్లాహ్ ను స్మరించుటలో అలసత్వం వహిస్తే, లేక అల్లాహ్ ను స్మరించే విషయం లో అతడు అజాగ్రత్తలో పడిపోతే, షైతాను అతడి నుండి తనకు కావలసినది ఏమిటో రాబట్టుకుంటాడు.

కనుక అల్లాహ్ యొక్క స్మరణ షైతాన్’ను పారద్రోలుతుంది.

ప్రతి షైతానుకు అనుయాయులున్నారు, సహాయకులు ఉన్నారు. వారు అతడి (షైతాను యొక్క) మాటలను, వార్తలను, ఆదేశాలను సంతోషంతో వింటారు, మరియు అనుసరిస్తారు.

التصنيفات

స్మరణలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు, ఇంటిలో ప్రవేశించేటప్పుడు మరియు బయటకు వచ్చేటప్పడు పఠించు దుఆలు