స్మరణలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం

స్మరణలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం

1- “ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”*. మరియు (ఆ వ్యక్తి) ఇంటిలోనికి ప్రవేశిస్తే, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే షైతాను ఇలా అంటాడు “రాత్రి గడపాడానికి స్థలం దొరికింది”; మరియు (ఆ వ్యక్తి) భోజనం తినడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే, (షైతాను) ఇలా అంటాడు “రాత్రి గడపడానికి స్థలమూ మరియు భోజనమూ రెండూ దొరికాయి.”

2- “ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! అల్లాహ్’ను స్మరిస్తూ ఉండడానికి నాకు ఏదైనా నేర్పించండి”. ఆయన ఇలా అన్నారు: @“నీవు ఇలా పలుకు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లాహు, అల్లాహు అక్బర్ కబీరా, వల్’హందులిల్లాహి కథీరా, సుబ్’హానల్లాహి రబ్బీల్ ఆ’లమీన్, లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అజీజిల్ హకీం”*; దానికి ఆ ఎడారివాసి “అవి నా ప్రభువు కొరకు, మరి నా కొరకు ఏమిటీ?” అని ప్రశ్నించాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకు అన్నారు: “అల్లాహుమ్మగ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వహ్’దినీ; వర్జుఖ్’నీ.”