“నీవు ఇలా పలుకు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లాహు, అల్లాహు అక్బర్ కబీరా, వల్’హందులిల్లాహి కథీరా,…

“నీవు ఇలా పలుకు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లాహు, అల్లాహు అక్బర్ కబీరా, వల్’హందులిల్లాహి కథీరా, సుబ్’హానల్లాహి రబ్బీల్ ఆ’లమీన్, లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అజీజిల్ హకీం”

సాద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! అల్లాహ్’ను స్మరిస్తూ ఉండడానికి నాకు ఏదైనా నేర్పించండి”. ఆయన ఇలా అన్నారు: “నీవు ఇలా పలుకు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లాహు, అల్లాహు అక్బర్ కబీరా, వల్’హందులిల్లాహి కథీరా, సుబ్’హానల్లాహి రబ్బీల్ ఆ’లమీన్, లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అజీజిల్ హకీం”; దానికి ఆ ఎడారివాసి “అవి నా ప్రభువు కొరకు, మరి నా కొరకు ఏమిటీ?” అని ప్రశ్నించాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకు అన్నారు: “అల్లాహుమ్మగ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వహ్’దినీ; వర్జుఖ్’నీ.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అల్లాహ్’ను స్మరిస్తూ ఉండడానికి నాకు ఏదైనా నేర్పించండి అని కోరాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఇలా పఠించు అని అన్నారు: “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి తౌహీద్ యొక్క షహాదత్ పదాలతో (ఏకేశ్వరోపాసన, ఆరాధ్యదైవం అల్లహ్ ఒక్కడే అని సాక్ష్యం పలికే పదాలతో) ప్రారంభించారు, అంటే అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి, భాగస్వామి, ఎవరూ లేరు అని అర్థం. “అల్లాహు అక్బర్ కబీరా” అంటే అల్లాహ్ అందరి కంటే, అన్నిటి కంటే గొప్పవాడు మరియు గొప్పతనం కలవాడు. “వల్’హందులిల్లాహి కసీరా” (ఓ అల్లాహ్ నీకు సమృద్ధిగా ప్రశంసలు) (ఓ అల్లాహ్ నీకు సమృద్ధిగా ప్రశంసలు) అంటే అల్లాహ్ యొక్క గుణవిశేషణాలకు, ఆయన చర్యలకు మరియు మానవాళిపై ఆయన యొక్క లెక్కలేనన్ని అనుగ్రహాల కొరకు అల్లాహ్ కు సమృద్ధిగా ప్రశంసలు. “సుబ్’హానల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” (సర్వలోకాల ప్రభువు అయిన అల్లాహ్ పవిత్రుడు). అంటే ఆయన సర్వశ్రేష్ఠుడు, మహోన్నతుడు, అసంపూర్ణత, మరియు కొరతలన్నింటికీ అతీతుడు. “లా హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిలజీజిల్ హకీం” (సర్వశక్తిమంతుడు మరియు వివేకవంతుడు అయిన అల్లాహ్‌తో తప్ప శక్తిగానీ లేదా బలం గానీ లేదు). అంటే: అల్లాహ్, మరియు ఆయన సహాయం, అనుగ్రహం మరియు మార్గదర్శకత్వం ద్వారా తప్ప మనిషి ఒక స్థితి నుండి మరొక స్థితికి మారలేడు – అని అర్థం ఇది విని ఆ మనిషి ఇలా అన్నాడు: “ఈ పదాలు నా ప్రభువును స్తుతించుట కొరకు, ఆయన ఘనతను కొనియాడుట కొరకు. మరి నేను నాకొరకు ఏమని వేడుకోవాలి?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీవు ఇలా వేడుకో: “అల్లాహుమ్మగ్’ఫిర్లీ” “ఓ అల్లాహ్ నా పాపములను క్షమించు” “వాటిని చెరిపి వేయడం ద్వారా మరియు వాటిని కప్పివేయడం ద్వారా” “వర్’హమ్నీ” “నన్ను కరుణించు, నన్ను అనుగ్రహించు” “ఈ పాపంచిక జీవితానికి మరియు నా పరలోక జీవితానికీ ప్రయోజనం చేకూర్చే వాటిని నాకు ప్రసాదించడం ద్వారా” “వహ్’దినీ” “నాకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు” “అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో; మరియు ఋజుమార్గం వైపునకు” “వర్’జుఖ్’నీ” “నన్ను ఆశీర్వదించు...” ధర్మబద్ధమైన (హలాల్) సంపదతో, ఆరోగ్యముతో, మంచితనం మరియు శ్రేయస్సుతో నన్ను ఆశీర్వదించు.

فوائد الحديث

అల్లాహ్ ను స్మరించుటను ప్రోత్సహించాలి, ఆయన ఏకత్వాన్ని, ఆయన గొప్పత్వాన్ని ప్రకటించాలి, ఆయనను స్మరించాలి, ఆయనను స్తుతించాలి.

ఆయనకు దుఆ చేయడానికి ముందు (ఆయనను వేడుకొనుటకు ముందు) ఆయనను స్తుతించడం, ఆయన గొప్పతనాన్ని, ఘనతను కొనియాడడం అభిలషణీయం.

ఈ ప్రాపంచిక జీవితంలోని మరియు పరలోకంలోని అన్ని మంచి విషయాలను మిళితం చేసి ఉత్తమమైన దుఆలతో (ప్రార్థనలతో) అల్లాహ్‌ను ప్రార్థించడం, అలాగే సహబాలు, సలఫ్ సాలిహీన్’లు చేసిన దుఆలతో (ప్రార్థనలతో) ప్రార్థించడం అభిలషణీయం. అయితే అతడు తాను కోరుకున్న విధంగా ప్రార్థించవచ్చు.

దాసుడు తనకు ఇహలోక జీవితం లోనూ, పరలోకంలోనూ తనకు మేలు చేకూర్చే విషయాలను నేర్చుకోవాలన్న ఆసక్తి అతనిలో ఉండాలి.

అల్లాహ్ ను క్షమాభిక్ష ప్రసాదించమని, కరుణించమని, మరియు ఉపాధిని ప్రసాదించమని దుఆ చేయుట కొరకు ప్రోత్సహించాలి; ఎందుకంటే అందులో శుభాలన్నీ కలిసి ఉన్నాయి.

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’కు ప్రయోజనం చేకూర్చే విషయాలను బోధించడం పట్ల ఆయన సంవేదన, దయాళుత్వము చూడవచ్చు.

ఇందులో శుద్దీకరణ ప్రక్రియ సంపూర్ణం కావడం కొరకు అల్లాహ్ యొక్క కరుణ, ఆయన క్షమాభిక్ష తరువాత ప్రస్తావించబడింది. ఆయన క్షమాభిక్ష పాపాలకు కప్పివేస్తుంది, వాటిని తుడిచివేస్తుంది, మరియు దాసుడిని నరకం నుండి తప్పిస్తుంది. మరి ఆయన కరుణ శుభాలను తీసుకువస్తుంది, స్వర్గములోనికి ప్రవేశింపజేస్తుంది. మరి అదే కదా మహోన్నత సాఫల్యం.

التصنيفات

స్మరణలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మాసూర్ దుఆలు