. . . . .

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (తరుచుగా) ఇలా పలుకుతూ ఉండేవారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు: "ఓ అల్లాహ్! నేను నీకు మాత్రమే సమర్పించుకుంటున్నాను, నిన్ను మాత్రమే విశ్వసిస్తున్నాను, నీపైనే ఆధారపడుతున్నాను, నీ వైపే పశ్చాత్తాపంతో మరలుతున్నాను, నీ సహాయంతోనే వాదిస్తున్నాను. నీ మహిమలోనే నేను ఆశ్రయాన్ని కోరుతున్నాను. నీవు తప్ప మరే ఆరాధ్యడూ లేడు. నీవు నన్ను తప్పుదారి పట్టించకు. నీవు ఎప్పటికీ జీవించే నిత్యుడివి, నీకు మరణం లేదు. కానీ జిన్నులు మరియు మనుషులు మాత్రం మరణిస్తారు."

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు: "(ఓ అల్లాహ్! నేను నీకు లొంగిపోతున్నాను) — నేను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను; (నేను నిన్నే విశ్వసిస్తున్నాను) — నేను నిన్నే అంగీకరిస్తున్నాను, నీవే సత్యమని ఒప్పు కుంటున్నాను; (నేను నీపైనే ఆధారపడుతున్నాను) — నా వ్యవహారాలను నీకు అప్పగిస్తున్నాను మరియు నీవే నాకు ఆధారం; (నేను నీ వైపే పశ్చాత్తాపంతో మరలుతున్నాను) — నేను తిరిగి నీవైపు వస్తున్నాను, నా తప్పులను నీ వద్ద ఒప్పుకుంటున్నాను; (నేను నీ సహాయంతోనే వాదిస్తున్నాను) — నీ శత్రువులతో వాదించడంలో నీ సహాయాన్ని మాత్రమే ఆశ్రయిస్తున్నాను; (ఓ అల్లాహ్! నేను నీ మహిమలోనే ఆశ్రయం కోరుతున్నాను) — నీ శక్తి, అధికారం, పరిపాలనలోనే నేను ఆశ్రయం పొందుతున్నాను; (నీవు మరే ఆరాధ్యుడూ లేడు) — నీవే సకల ఆరాధనలకు యోగ్యుడవు, నీవు తప్ప ఆరాధించబడే అర్హత గలవారు మరెవ్వరూ లేరు; (నీవు నన్ను తప్పుదారి పట్టించకు) — నీవు నన్ను సత్య మార్గం నుండి దూరం చేయకు, నీ అనుగ్రహాన్ని పొందకుండా నన్ను దూరం చేయకు; (నీవు ఎప్పటికీ జీవించే నిత్యుడివి, నీకు మరణం లేదు) — నీవు శాశ్వతంగా జీవించేవాడివి, నీకు మరణం లేదు. (కానీ జిన్నులు మరియు మనుషులు మాత్రం మరణిస్తారు) — జిన్నులు మరియు మనుషులు మాత్రం ఖచ్చితంగా మరణించేవారు."

فوائد الحديث

ఏదైనా దుఆ చేసే ముందు, అల్లాహ్‌ను స్తుతిస్తూ, ప్రార్థన ప్రారంభించడం షరీఅతు ప్రకారం ధర్మబద్ధమైనది.

మహోన్నతుడైన అల్లాహ్ మీద మాత్రమే ఆధారపడటం, ఆయన వద్దే రక్షణ కోరటం తప్పనిసరి. ఎందుకంటే, పరిపూర్ణ లక్షణాలు కేవలం ఆయనకే ఉన్నాయి. ఆయన మీదే మనం పూర్తిగా ఆధారపడాలి; సృష్టిలోని ప్రతిదీ శక్తిహీనమైనది, చివరికి ప్రతిదీ నశిస్తుంది, మరణిస్తుంది. కాబట్టి, వాటిపై ఆధారపడటం అనర్హమైనది.

ఈ సంపూర్ణమైన పదాలతో దుఆ చేయడంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం ఉంది — ఇది నిజమైన విశ్వాసాన్ని, పరిపూర్ణ నమ్మకాన్ని వ్యక్తపరచడానికి దోహద పడుతుంది.

అస్-సింది (రహిమహుల్లాహ్) ఇలా పలికినారు: ఆయన చెప్పిన "నీవు ఎప్పటికీ జీవించే నిత్యుడివి" అనే వాక్యం యొక్క అర్థం — మనం నీ వద్ద మాత్రమే ఆశ్రయం కోరాలి, ఇతరుల వద్ద కానేకాదు.

التصنيفات

స్మరణలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మాసూర్ దుఆలు