. . : :

జైద్ ఇబ్నె థాబిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సహరీ (ఉపవాసం ప్రారంభించే ముందు చేసే) భోజనం చేసినాము. తర్వాత ఆయన నమాజ్‌ కొరకు లేచినారు. అపుడు నేను ఇలా అడిగాను: అదాన్ (నమాజు కొరకు పిలిచే పిలుపు) మరియు సహరీ మధ్య ఎంత సమయం ఉండింది? దానికి ఆయన ఇలా అన్నారు: సుమారు 50 ఆయతుల అంత (అంటే 50 ఖుర్‌ఆన్ వచనాలు పఠించే సమయమంత అని అర్థము).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కొంతమంది సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) సహరీ భోజనం చేసినారు, అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు కొరకు లేచినారు. జైద్ బిన్ థాబిత్ (రదియల్లాహు అన్హు)ను, అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అడిగినారు: 'అదాన్ కు మరియు సహరీ భోజనం పూర్తి చేసిన దానికి మధ్య ఎంత సమయం ఉండింది? దానికి జైద్ బిన్ థాబిత్ (రదియల్లాహు అన్హు) ఇలా జవాబిచ్చారు: 'సగటు పరిమాణంలో ఉన్న యాభై ఆయతులు (ఖుర్ఆన్ వచనాలు) చదివేంత సమయం - అది చాలా దీర్ఘమైనవి లేదా చాలా చిన్నవి కాదు. అలాగే చాలా వేగంగా లేదా మరీ నిదానంగా పఠించడానికి పట్టే సమయము కాదు.

فوائد الحديث

సహరీ భోజనమును ఫజ్ర్‌ సమయం ముందు వరకు ఆలస్యం చేయడం ఉత్తమం. ఎందుకంటే ఆలస్యంగా సహరీ భుజిస్తే దాని లాభం శరీరానికి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆ దినపు మొత్తం ఉపవాసంలో దాని ప్రయోజనం కూడా ఎక్కువగా ఉంటుంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు సమావేసమవటంలో, ఆయన నుండి నేర్చుకోవడంలో సహాబాలు ఎంతో ఆసక్తి చూపేవారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. అపుడపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి భోజనం కూడా చేసేవారు.

ఉపవాసం ఆరంభించ వలసిన సమయం (ఇమ్సాక్) ఫజ్ర్ సలాహ్ సమయం ప్రారంభానికి కొంచెం ముందే అంటే ఉషోదయపు తొలివెలుగు కనబడగానే (ఫజ్ర్ అదాన్ సమయంతోనే ) మొదలవుతుంది.

అదాన్ (నమాజు పిలుపు) మరియు సహరీ (ఉపవాస పూర్వ భోజనం) మధ్య ఎంత సమయం ఉండేది?" అనే ప్రశ్నకు సంబంధించి, ఇక్కడ అర్థం సహరీ ముగింపు మరియు ఇఖామత్ (నమాజు ప్రారంభ పిలుపు) మధ్య సమయం. ఎందుకంటే మరొక హదీథులో ఇలా పేర్కొనబడినది: "వారు సహరీ పూర్తి చేసి, నమాజులో ప్రవేశించడానికి మధ్య ఎంత సమయం ఉండేది?" హదీథులు ఒకదానికొకటి వివరించే స్వభావం కలిగి ఉంటాయి.

అల్-ముహల్లబ్ ఇలా అన్నారు: ఇందులో శారీరక ఆచరణల ఆధారంగా సమయాలను అంచనా వేయడం కూడా ఉంది. అరబ్బులు ఆచరణల ఆధారంగా సమయాన్ని అంచనా వేసేవారు, ఉదాహరణకు: గొర్రె పాలు పితికే సమయం లేదా ఒంటెను వధించడానికి పట్టే సమయం. ఇక్కడ జైద్ ఇబ్న్ థాబిత్, రదియల్లాహు అన్హు, దానిని ఖుర్ఆన్ పారాయణం ద్వారా అంచనా వేయడానికి మార్చారు. ఇది ఖుర్ఆన్ వచనాల పారాయణంలో గడిపే ఆరాధనా సమయం అని సూచిస్తుంది. వారు ఆచరణల ఆధారంగా కాకుండా వేరే దాని ఆధారంగా సమయాలను అంచనా వేసి ఉంటే, వారు ఇలా చెప్పేవారు, ఉదాహరణకు: ఒక స్థాయికి చేరుకోవడానికి పట్టే సమయం లేదా గంటలో ఐదవ వంతులో మూడవ వంతు.

ఇబ్న్ అబీ జుమ్రా ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజానికి ఏది సులభంగా ఉంటుందో దానినే ఎంచుకుని చేసేవారు. ఒకవేళ ఆయన సహరీ చేయకుండా ఉంటే, ప్రజలు కూడా ఆయనను అనుసరించి సహరీ చేయకుండా ఉండేవారు. అది కొందరికి కష్టంగా మారేది.

అలాగే, ఆయన అర్ధరాత్రి సహరీ చేస్తే, ఎక్కువగా నిద్ర పోయే వారిలో కొందరికి అది కష్టంగా మారేది. దాంతో వారు ఫజ్ర్ నమాజు చేయకుండా ఉండే ప్రమాదం ఉండేది లేదా రాత్రంతా మేలుకుని ఉండవలసి వచ్చేది.

التصنيفات

ఉపవాసాల సున్నతులు