రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.

రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైలతుల్ ఖదర్ ను అన్వేషించడంలో, మంచి పనులను అధికం చేయడంలో, పశ్చాత్తాప పడుతూ తౌబా చేయడంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ప్రోత్సహించారు. ఈ రాత్రి ప్రతి సంవత్సరం రమదాన్ చివరి పది రోజులలోని బేసి రాత్రుల్లో (21, 23, 25, 27, 29వ రాత్రులు) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

فوائد الحديث

లైలతుల్ ఖదర్ ఘనత మరియు దానిని అన్వేషించాలనే ప్రోత్సాహించటం

తన వివేకం మరియు దయ కారణంగా, అల్లాహ్ లైలతుల్ ఖదర్ ఖచ్చితంగా ఏ రాత్రో స్పష్టంగా తెలియజేయలేదు.

లైలతుల్ ఖదర్ రమదాన్ చివరి పది రాత్రుల్లో ఉంటుంది, అందులోనూ ముఖ్యంగా బేసి రాత్రులలో (21వ, 23వ, 25వ, 27వ, 29వ రాత్రులలో) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

లైలతుల్ ఖదర్ రమదాన్ చివరి పది రాత్రుల్లో ఒకటి. ఈ రాత్రే మహోన్నతుడైన అల్లాహ్, ఖుర్ఆన్‌ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వచనాల రూపంలో అవతరింపజేసినాడు. ఈ రాత్రి పుణ్యముల, దీవెనల, మరియు ఆ రాత్రిలో చేసిన మంచి పనుల ప్రభావం పరమ శక్తివంతమైనది. ఈ రాత్రి దీవెనలు వెయ్యి నెలల దీవెనల కంటే మెరుగ్గా ఉంటాయి.

"ఖదర్ రాత్రి" (లయ్లతుల్ ఖదర్) అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రాత్రికి "ఖదర్" అనే పేరు రెండు ముఖ్యమైన కారణాల వల్ల వచ్చిందని పండితులు వివరిస్తారు: 1. గౌరవం, గొప్పతనం (Value, Status) "ఖదర్" అన్నది అరబిక్‌లో "గౌరవం", "ప్రతిష్ట", "స్థాయి" అనే అర్థాలను కలిగి ఉంది. ఎవరైనా గొప్ప స్థాయిలో ఉన్నవారిని "అతను గొప్ప ఖదర్ కలవాడు" అని అంటారు. అందువల్ల, "ఖదర్ రాత్రి" అంటే "గౌరవవంతమైన రాత్రి", "ప్రతిష్టాత్మకమైన రాత్రి" అని అర్థం. ఖుర్ఆన్‌లోనూ ఇలా ఉంది: {మేము దాన్ని (ఖుర్ఆన్‌ను) దివ్యమైన రాత్రిలో దించాము} (సూరహ్ అల్-దుఖాన్: 3) 2. నిర్ణయం, విధి (Decree, Taqdīr) "ఖదర్" అనే పదం "తక్దీర్" (విధి, నిర్ణయం) అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. అంటే, ఈ రాత్రిలో వచ్చే ఏడాది జరిగే విషయాలన్నీ నిర్ణయించబడతాయి. దీనికి ఖుర్ఆన్‌లోని ఆధారం: {ఆ రాత్రిలో ప్రతి జ్ఞానవంతమైన విషయం నిర్ణయించబడుతుంది} (సూరహ్ అల్-దుఖాన్: 4)

التصنيفات

రమదాన్ మాసపు చివరి పది రోజులు