“శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”

“శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరిస్తున్నారు: భర్త తన భార్య మలద్వారంలోనికి ప్రవేశించరాదు; అలా చేసేవాడు శపించబడ్డాడు మరియు అల్లాహ్ దయ నుండి, కరుణ నుండి అతడు బహిష్కరించబడ్డాడు మరియు అది ఘోరమైన పాపములలో (కబాయిర్ లలో) ఒకటి.

فوائد الحديث

స్త్రీ మలద్వారము ద్వారా సంభోగించడం నిషేధము (హరాం).

మలద్వారము మినహా పురుషుడు తన భార్య శరీరము ద్వారా సంతోషాన్ని పొందుట అనుమతించబడినది.

అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ఒక ముస్లిం తన భార్యతో యోని ద్వారా సంభోగం చేస్తాడు, కానీ ఆమె మలద్వారము ద్వారా సంభోగం విషయానికొస్తే, అది సృష్టి సహజ స్వభావాన్ని పాడు చేస్తుంది, సంతానోత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది, ఆరోగ్యకరమైన మానవ స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది మరియు భార్యాభర్తలిద్దరికీ గణనీయమైన హాని కలిగిస్తుంది.

التصنيفات

నికాహ్ పద్దతులు