ఒక ముస్లిం తన వీలునామా రాసి తనతో ఉంచుకోకుండా మూడు రాత్రులు ఉండడం సముచితం కాదు

ఒక ముస్లిం తన వీలునామా రాసి తనతో ఉంచుకోకుండా మూడు రాత్రులు ఉండడం సముచితం కాదు

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నారు: "ఒక ముస్లిం తన వీలునామా రాసి తనతో ఉంచుకోకుండా మూడు రాత్రులు ఉండడం సముచితం కాదు." అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అనడం నేను విన్నప్పటి నుండి, నా వీలునామా నాతో లేకుండా ఒక్క రాత్రి కూడా గడిచిపోలేదు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఒక ముస్లింకు వీలునామా రాసి ఇవ్వడానికి ఏవైనా హక్కులు లేదా ఆస్తులు ఉంటే, అది చిన్నదైనా సరే, తన వీలునామా రాసి సిద్ధంగా ఉంచుకోకుండా మూడు రాత్రులు గడపరాదని ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదిఅల్లాహు అన్హుమా ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చెప్పగా విన్నప్పటి నుండి, నా వీలునామా నా వద్ద సిద్ధంగా లేకుండా నేను ఒక్క రాత్రి కూడా గడపలేదు.

فوائد الحديث

వీలునామాను స్పష్టం చేయడానికి, శాసనకర్త అయిన అల్లాహ్ ఆజ్ఞను పాటించడానికి, మరణానికి సిద్ధం కావడానికి మరియు ఏదైనా అడ్డంకి వల్ల దాని పైనుండి ధ్యానం మరలక ముందే దాని వివరాలను గురించి మరియు లబ్ధిదారులను క్షుణ్ణంగా ఆలోచించడానికి వీలునామా తయారు చేయడం మరియు దానిని తయారు చేయడానికి తొందరపడటం షరియత్ ప్రకారం చట్టబధ్ధమైనదే.

“అల్-వసియ్యహ్” (వీలునామా): అల్ వసియ్యహ్ అంటే ఒక వ్యక్తి తన మరణం తర్వాత తన సంపదలో కొంత నిర్వహణ బాధ్యతను ఎవరికైనా అప్పగించడం, లేదా తన చిన్న పిల్లలను చూసుకోవడానికి ఎవరికైనా అప్పగించడం లేదా లేదా తన మరణం తర్వాత తనకున్న ఏదైనా పని లేదా వస్తువును ఎవరికైనా అప్పగించడం.

“అల్ వసియ్యహ్”ను (వీలునామాను) మూడు వర్గాలుగా వర్గీకరించారు: 1. “ముస్తహబ్” (అభిలషణీయమైనది): ఇది ఒకరి సంపదలో కొంత భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు లేదా ఔదార్య కార్యక్రమాలకు ఖర్చు చేయడానికి కేటాయించే వీలునామా, తద్వారా అతని మరణం తర్వాత కూడా ఆ ప్రతిఫలం అతనికి చేరుతూనే ఉంటుంది; 2. “వాజిబ్” (విధిగా (తప్పనిసరిగా) చేయవలసిన) వీలునామా: ఇది ఒకరి హక్కులకు సంబంధించిన వీలునామా; ఈ హక్కులు సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు ఋణపడి ఉన్నవి కావచ్చు, ఉదాహరణకు: చెల్లించని జకాతు, చెల్లించని కఫ్ఫారా (ప్రాయశ్చిత్తం), లేదా ఇస్లామిక్ చట్టం ప్రకారం విధిగా చెల్లించవలసిన ఇలాంటి బాధ్యతలు; అలాగే ఈ హక్కులు మానవులకు సంబంధించినవి అయినా కావచ్చు, ఉదాహరణకు: ఇతర వ్యక్తులకు ఏమైనా ఋణపడి ఉన్న విషయాలు, అంటే అప్పులు, లేదా అమానతులు, (అమానతులు అంటే అంటే మీపై విశ్వాసముతో ఇతరులు మీవద్ద ఉంచిన వస్తువులు, సంపదలు) మొదలైన విషయాలకు సంబంధించిన వీలునామా; 3. “హరాం” వీలునామా (నిషేధించబడిన వీలునామా): అంటే ఒక వ్యక్తి యొక్క వీలునామా అతని సంపదలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా ఉన్నట్లైతే అది హరాం (నిషేధము, అలా చేయరాదు) లేదా అతను దానిని వారసులలో ఒకనికి వారసత్వంగా ఇచ్చినట్లైతే అది కూడా హరాం (నిషేధము) అవుతుంది.

"ఈ హదీసులో, ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) యొక్క ఘనత, మంచి చేయడంలో ఆయన చొరవ మరియు మహా ఙ్ఞాని మరియు షరియత్ ప్రధాత అయిన అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం చూస్తాము."

ఇబ్నె దఖీక్ అల్-ఈద్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:ఈ హదీథులో రెండు లేదా మూడు రాత్రులను అనుమతించడం అంటే దాని వల్ల కలిగే కష్టాలను మరియు ఇబ్బందులను ఉపశమింపజేయడం.

ముఖ్యమైన విషయాలను వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి, ఎందుకంటే ఈ విధానం మరింత విశ్వసనీయమైనది, మరింత ప్రభావవంతమైనది; మరియు ఈ విధానం హక్కులను పరిరక్షిస్తుంది.

التصنيفات

వీలునామ