إعدادات العرض
కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక…
కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština ગુજરાતી አማርኛ Yorùbá Nederlands اردو Español Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe Bosanski සිංහල हिन्दी Tiếng Việt Hausa മലയാളം Kiswahili ไทย پښتو অসমীয়া Shqip دری Ελληνικά Български Fulfulde Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Kurdî Wolof Moore Français Oromoo Українська Tagalog Azərbaycan தமிழ் bm Deutsch ქართული Português mk Magyarالشرح
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు:{ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు:''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞాన వంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఇందులో అల్లాహ్ సుబ్’హానహూ వ త’ఆలా తానే తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దివ్య ఖుర్’ఆన్ ను అవతరింపజేసినాను అని అంటున్నాడు; అందులో విస్పష్టమైన ఆయతులు ఉన్నాయని, వాటిలోని ఆదేశాలు, మరియు నిబంధనలలో ఎటువంటి అస్పష్టత లేనివి అని అంటున్నాడు. అవి దివ్య గ్రంథానికి పునాది వంటివి, మరియు నిర్దేశకాల (reference) వంటివి (దిశా నిర్దేశము చేయునటువంటివి). ఆయతుల మధ్య అనంగీకార సందర్భాలలో ఇవి (సరియైన అర్థం వైపునకు) దిశా నిర్దేశము చేస్తాయి. అదే విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని కొన్ని ఆయతులు ఒకటి కంటే ఎక్కువ అర్థాలనిచ్చే సంభావ్యత కలిగినవి ఉన్నాయి. కనుక అవి కొంతమంది ప్రజలను (వెంటనే అర్థం కాక) అస్పష్టతకు గురి చేయవచ్చు, లేక ఈ ఆయతుల మధ్య మరియు ఇతర ఆయతుల మధ్య సమన్వయం లేదు అనిపించవచ్చు. అటువంటి ఆయతుల పట్ల ప్రజలు ఏవిధంగా వ్యవహరిస్తారో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అటువంటి ఆయతుల సరియైన అర్థాన్ని తెలుసుకునే క్రమంలో కొందరు, పునాదుల వంటి ఆయతులను (సంప్రదించకుండా) వదిలి వేస్తారు. తమ అవగాహనకు దగ్గరగా ఉన్న అర్థాన్ని తీసుకుంటారు. ఆ విధంగా ప్రజలలో సందేహాలను రేకెత్తిస్తారు, వారిని అపమార్గం పట్టిస్తారు. అలాగే ఎవరైతే తమ ఙ్ఞానములో స్థిరంగా ఉంటారో, వారు ఈ (ఒకటి కంటే ఎక్కువ అర్థాలను ఇచ్చే) ఆయతులను గురించి ఎరుగుదురు. వారు పునాదుల వంటి ఆయతుల దిశా నిర్దేశములో వాటి అర్థాన్ని గ్రహిస్తారు, మరియు వాటిలో అస్పష్టతగానీ, సమన్వయలోపం గానే ఏమీ లేదని, అవి సర్వ శక్తిమంతుడూ, సర్వోత్కృష్టుడూ అయిన అల్లాహ్ తరఫునుండి అని విశ్వసిస్తారు. అయితే స్వాస్థ్యమేధస్సు గలవారు మాత్రమే దాని నుండి గ్రహిస్తారు మరియు నేర్చుకుంటారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల మాత (ఉమ్ముల్ మోమినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా తో ఒకవేళ తను ఆ విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని అస్పష్టమైన ఆయతుల వెంట పడేవారిని గనుక చూసినట్లైతే, వారిని గురించి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు) అని, వారితో జాగ్రత్తగా ఉండమని అన్నారు, వారు చెప్పేది విన వద్దు అని అన్నారు.فوائد الحديث
దివ్య ఖుర్’ఆన్ లో విస్పష్టమైన (అల్-ముహ్’కమ్) ఆయతులు: వీటి ప్రాముఖ్యతలో గాని, లేక వీటి అర్థములో గానీ ఎటువంటి సందేహము, లేక అస్పష్టత ఎంత మాత్రమూ లేనటువంటి ఆయతులు.
దివ్య ఖుర్’ఆన్ లో అస్పష్టమైన (అల్-ముతషాబిహ్) ఆయతులు: ఇవి ఒకటి కంటే ఎక్కువ అర్థాలను కలిగి ఉండే ఆయతులు. వీటిని అనుసరించడానికి, వీటిని గురించి నేర్చుకోవడానికి సరియైన అవగాహన, ఆలోచన, పరిఙ్ఞానము అవసరం.
ఇందులో – ఎవరి హృదయాలలోనైతే వక్రత ఉన్నదో వారితో, మరియు మోసపూరిత వ్యక్తులతో కలవడం, వారి సాంగత్యములో కూర్చొనుట చేయరాదని, అలాగే (ధర్మానుసరణలో) ప్రజలకు కష్టాలను కలుగజేసే వారితోనూ, వారిలో సందేహాలు, అనుమాలు రేకెత్తించే వారితోనూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక ఉన్నది.
ఆయతు చివరన సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు {జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు} అని. దీని ద్వారా అల్లాహ్ హృదయాలలో వక్రత ఉన్నవారిని బహిర్గతం చేసాడు, మరియు ధర్మానుసరణలో స్థిరపాదులై ఉన్నవారిని ప్రశంసించినాడు. అంటే, సరియైన అవగాహన, ఆలోచన, పరిఙ్ఞానముల సహాయంతో కాకుండా తమ మనసుకు నచ్చిన విధంగా భాష్యం చెప్పే వారు ఙ్ఞానవంతుల పరిధిలోని వారు కారు.
హృదయాలలో వక్రత జనించడానికి కారణాలలో, సరియైన అవగాహన, ఆలోచన, పరిఙ్ఞానము లేకుండా అస్పష్ట విషయాల వెంట పడుట ఒకటి.
దివ్య ఖుర్’ఆన్ లో అస్పష్టమైన ఆయతులను అర్థం చేసుకోవడానికి, వాటిని మూల స్తంభాలవంటి విస్పష్టమైన ఆయతుల వైపునకు మరలించుట (వాటి దిశా నిర్దేశములో ఆ ఆయతులను అర్థం చేసుకొనుట) ప్రతివారిపై విధి.
దివ్య ఖుర్’ఆన్ లో కొన్ని విస్పష్టమైన ఆయతులు, మరికొన్ని స్పష్టత లేని ఆయతులు ఉండుట అనేది స్థిరపరిఙ్ఞానము గల విశ్వాసులను మరియు అపమార్గము పాలైన వారిని గుర్తించడానికి ప్రజల కొరకు ఒక పరీక్ష వంటిది.
దివ్య ఖుర్’ఆన్ లో అస్పష్టమైన ఆయతుల ఉనికి: ఇది సాధారణ ప్రజలపై ఙ్ఞానవంతుల ఔన్నత్యాన్ని చాటి చెపుతుంది. అలాగే మానవుని బుద్ధి ఎంత లోపభూయిష్టమైనదో తెలియజేస్తుంది. కనుక (మానవుడు) తన అశక్తతను గ్రహించి అన్నివేళలా తన సృష్టికర్త విధేయతలో ఉండాలనే సూచన ఉన్నది.
ఇందులో - ఙ్ఞానములో స్థిరపాదులై ఉండుట యొక్క ఘనత మరియు దాని యొక్క అవసరం తెలుస్తున్నది.
ఆయతులో {వాటి అసలు అర్థం అల్లాహ్‌కు మరియు పరిపక్వ జ్ఞానం గలవారికి తప్ప మరెవ్వరికీ తెలియదు} అనే భాగముపై దివ్య ఖుర్’ఆన్ విశ్లేషకుల పక్షమునకు సంబంధించి రెండు విషయాలు ఉన్నాయి: ఎవరైతే ‘అల్లాహ్’కు తప్ప’ అనే పదం వద్ద ఆగుతారో, దాని అర్థం ఏమిటంటే; కొన్ని విషయాలు ఎటువంటివి అంటే వాటి వాస్తవిక ఙ్ఞానమును అర్థం చేసుకోవడానికి మనవద్ద మరింకే సాధనం కూడా లేనటువంటివి (అంటే వాటి సంపూర్ణ ఙ్ఞానము కేవలం అల్లాహ్ వద్దనే ఉంటుంది). ఉదాహరణకు ఆత్మ మరియు దానికి సంబంధించిన ఆఙ్ఞలు, ఆదేశాలు, ఇంకా ప్రళయ ఘడియ ను గురించిన ఙ్ఞానము. ఎవరైతే ధార్మిక ఙ్ఞానములో స్థిరపాదులై ఉంటారో వారు దీనిని విశ్వసిస్తారు, ఈ విషయాల ఙ్ఞానమును అల్లాహ్’కు మాత్రమే వదిలి వేస్తారు. ఆవిధంగా అల్లాహ్ కు విధేయత ప్రకటించి విధేయులై ఉంటారు. అలాగే ఎవరైతే ‘అల్లాహ్’కు తప్ప’ అనే పదం వద్ద ఆగకుండా ముందుకు సాగుతారో, దాని అర్థము: ఆయతుల అర్థము, భావము మరియు వివరణ – వీటి యొక్క ఙ్ఞానము అల్లాహ్ వద్ద ఉంటుంది మరియు ఆయన ఎవరినైతే ఎంచుకుంటాడొ, అటువంటి ఙ్ఞానవంతులకు, ఉలమాలకు, విద్వాంసులకు కూడా ఉంటుంది. వారు స్పష్టత లేని ఆయతులను మూల స్తంభాల వంటి విస్పస్టమైన ఆయతుల వైపునకు మరలించి వాటి దిశా నిర్దేశములో ఆ ఆయతులను అర్థం చేసుకుంటారు.