“నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం…

“నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వేయి రెట్లు ఉత్తమమైనది.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా ఈ మస్జిదులో ఆచరించే ఒక నమాజు, (మక్కాలోని) ఒక్క మస్జిదె హరం లో తప్ప, మరెక్కడైనా ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో వేయి రెట్లు ఉత్తమమైనది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మస్జిదులో నమాజు ఆచరించుట యొక్క ఘనతను తెలియజేస్తున్నారు; అది భూమిపై మరే ఇతర మస్జిదులలో ఆచరించే నమాజు కంటే పుణ్యఫలములో వెయ్యి రెట్లు ఉత్తమమైనది, కేవలం మక్కాలో ఉన్న మస్జిదె హరంలో ఆచరించే నమాజు మినహాయించి. మక్కాలోని మస్జిదె హరంలో ఆచరించే నమాజు ఆయన (స) మస్జిదులో ఆచరించే నమాజుకంటే పుణ్యఫలం (అజ్ర్)లో మరింత ఉత్తమమైనది.

فوائد الحديث

దీని నుండి మస్జిదె నబవీ మరియు మస్జిదె హరంలలో ఆచరించబడే నమాజులు ఇతర మస్జిదులలో ఆచరించబడే నమాజు కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనవి అని తెలుస్తున్నది.

మస్జిదె హరంలో ఆచరించే నమాజు, మిగతా మస్జిదులలో ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో ఒక లక్ష నమాజులు ఆచరించినంత ఉత్తమమైనది.

التصنيفات

మస్జిదుల ఆదేశాలు