إعدادات العرض
ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్…
ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని దిమ్మహ్ (సంరక్షణ) ఉంది. కావున అతని విషయంలో అల్లాహ్ యొక్క దిమ్మహ్ ను ఉల్లంఘించకండి
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «ఎవరైతే మా నమాజును ఆచరించి, మా ఖిబ్లా వైపు తిరిగి, మేము జిబహ్ చేసిన దానిని తింటారో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని దిమ్మహ్ (సంరక్షణ) ఉంది. కావున అతని విషయంలో అల్లాహ్ యొక్క దిమ్మహ్ ను ఉల్లంఘించకండి».
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული বাংলা Kurdî ไทย অসমীয়া Indonesia Nederlands ਪੰਜਾਬੀ Kiswahili Hausa ភាសាខ្មែរ English ગુજરાતી Tagalog Русский मराठी മലയാളം ಕನ್ನಡ Српски සිංහල Türkçe हिन्दी اردوالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినది ఏమిటంటే, ఎవరైతే ఇస్లాం ధర్మం యొక్క బహిరంగ ఆచారాలకు కట్టుబడి, మనలా నమాజు చేస్తాడో, మన ఖిబ్లా అయిన కఅబహ్ వైపునకు అభిముఖుడవుతాడో మరియు మనం జిబహ్ చేసిన దానిని ధర్మసమ్మతమైనదిగా భావించి తింటాడో, అతడే ముస్లిం. అతనికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క రక్షణ మరియు వాగ్దానం ఉంది. కాబట్టి అతని విషయంలో అల్లాహ్ యొక్క రక్షణ మరియు వాగ్దానాన్ని ఉల్లంఘించకండి.فوائد الحديث
ఇబ్ను రజబ్ అన్నారు: ఈ హదీథు సూచిస్తున్నది ఏమిటంటే వాటి హక్కులను నెరవేర్చనంత వరకు, కేవలం షహాదతైన్ పలకడంతో రక్తం రక్షించబడదు. వాటి హక్కులలో అత్యంత ధృడమైనది నమాజు; అందువల్ల దానిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరియు మరో హదీథులో నమాజుకు జకాతు కూడా చేర్చబడింది .
ప్రజల వ్యవహారాలు వారి అంతరంగాన్ని బట్టి కాకుండా, వారి బాహ్య రూపాన్ని బట్టి నిర్ధారించబడతాయి. కావున, ఎవరైతే ఇస్లాం ధర్మ చిహ్నాలను బహిర్గతం చేస్తారో, అతని నుండి దానికి విరుద్ధమైనది వ్యక్తము కానంత వరకు, అతనిపై ఇస్లామీయ ఆదేశాలు వర్తింపజేయబడతాయి.
ఇబ్నె రజబ్ అన్నారు: ఖిబ్లా వైపు అభిముఖమవటాన్ని ప్రస్తావించటం, తమ ప్రవక్తపై అవతరింపజేయబడిన గ్రంథంలో ధర్మబద్ధం చేయబడిన ముస్లింల నమాజును - అంటే కాబాదిశ వైపు తిరిగి చేసే నమాజును - తప్పక ఆచరించాలనే దానికి ఒక సంకేతం. కాబట్టి, అలా చేయమనే ఆదేశం రద్దు అయిన తర్వాత కూడా యూదుల వలే బైతుల్ మఖ్దిస్ వైపు తిరిగి లేదా క్రైస్తవుల వలే తూర్పు వైపు తిరిగి నమాజు చేసేవాడు, తౌహీద్ సాక్ష్యం పలికినప్పటికీ ముస్లిం కాడు.
ఇందులో నమాజులో ఖిబ్లా వైపుకు అభిముఖం కావడం యొక్క గొప్ప ప్రాముఖ్యత రుజువు అవుతుంది; ఎందుకంటే, స్వచ్ఛత (తహారత్) మొదలైన నమాజు యొక్క ఇతర షరతులను ప్రస్తావించకుండా, కేవలం దీనిని మాత్రమే ప్రస్తావించారు.
ఇబ్న్ రజబ్ అన్నారు: ముస్లింల జిబహ్ తినడాన్ని ప్రస్తావించడంలో ఒక సూచన ఉంది, అదేమిటంటే ఇస్లాం యొక్క అన్ని బహిరంగ షరియా ఆదేశాలకు కట్టుబడి ఉండటం తప్పనిసరి. వాటిలో అత్యంత గొప్పవి ముస్లింల జిబహ్ తినడం, మరియు వారి జిబహ్ విషయంలో వారితో ఏకీభవించడం. కాబట్టి ఎవరైతే దీని నుండి నిరాకరిస్తాడో, అతను ముస్లిం కాదు.
