“నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను…

“నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు, కానీ వారి మధ్య విభేదాల బీజాలను నాటగలనని అతడు ఆశిస్తున్నాడు.”

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు, కానీ వారి మధ్య విభేదాల బీజాలను నాటగలనని అతడు ఆశిస్తున్నాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అరేబియా ద్వీపకల్పంలో నమాజులను ఆచరించే విశ్వాసులు తనను ఆరాధించడం మరియు విగ్రహాలకు సాష్టాంగం చేయడం వైపు తిరిగి వస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు. అయినప్పటికీ, వివాదాలు, శత్రుత్వం, యుద్ధాలు, కలహాలు మొదలైన వాటిని ప్రేరేపించడం ద్వారా వారి మధ్య విభేదాలను నాటడానికి అతను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు మరియు కష్టపడుతూనే ఉన్నాడు.

فوائد الحديث

ఈ హదీథులో షైతానును పూజించడం అనే ప్రస్తావన వచ్చింది. షైతానును పూజించడం అంటే విగ్రహాలను పూజించడమే. దివ్య ఖుర్’ఆన్ లో ఇబ్రాహీం (అలైహిస్సలాం) గురించి అవతరించిన ఆయతు ద్వారా ఇది రుజువు అవుతుంది:

(يَا أَبَتِ لَا تَعْبُدِ الشَّيْطَان ) (''ఓ నా తండ్రీ! నీవు షై'తాన్‌ను ఆరాధించకు : సూరహ్ ఇబ్రాహీం 19:44) (ఇబ్రాహీం (అలైహిస్సలాం) తండ్రి విగ్రహాలను తయారు చేసేవారు, వాటిని పూజించేవారు)

సాతాను ముస్లింలలో విభేదాలు, శత్రుత్వం, యుద్ధాలు మరియు రాజద్రోహాలను, దేశద్రోహాలను కలిగించడానికి ప్రయత్నిస్తాడు.

ఇస్లాంలో నమాజు యొక్క ప్రయోజనాల్లో ఒకటి, ఇది ముస్లింల మధ్య అనురాగాన్ని, సుహృద్భావాన్ని కాపాడుతుంది మరియు వారి మధ్య సహోదర బంధాలను బలపరుస్తుంది.

ఇస్లాం లో ‘షహాదతైన్’ (విశ్వాసం యొక్క రెండు సాక్ష్యపు ప్రకటనలు: అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్’హదు అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్) తర్వాత సలాహ్ (నమాజు) అనేది ధర్మము యొక్క గొప్ప ఆచరణ, అందుకే ముస్లింలు “అల్-ముసల్లీన్” (విధిగా నమాజులను ఆచరించేవారు) అని పిలవబడినారు.

ఇతర దేశాలకు లేని కొన్ని ప్రత్యేక లక్షణాలు అరేబియా ద్వీపకల్పానికి ఉన్నాయి.

అరేబియా ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాలలో విగ్రహారాధన జరిగిందని చెప్పబడినపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనడం: (...నమాజులను ఆచరించే విశ్వాసులు తనను ఆరాధించడం మరియు విగ్రహాలకు సాష్టాంగం చేయడం వైపు తిరిగి వస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు), ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలుగా కనిపిస్తాయి. దీనికి సమాధానం ఏమిటంటే, ప్రవక్త మాటలు వాస్తవానికి, వారి విజయాలను మరియు ప్రజలు అల్లాహ్ ధర్మం లోనికి గుంపులు గుంపులుగా ప్రవేశించడాన్ని చూసినప్పుడు సాతాను అనుభవించిన నిరాశను తెలియజేస్తాయి. కనుక, హదీథు సాతాను యొక్క ఊహలు మరియు అంచనాలను తెలియజేస్తున్నది. కానీ వాస్తవానికి ఏమి జరిగినదో, అల్లాహ్ ఉద్దేశించిన వివేకము ప్రకారం భిన్నంగా ఉండవచ్చు.

التصنيفات

దుర్గుణాలు