(నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్…

(నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”

అల్ బరా ఇబ్న్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: (నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ చేయునపుడు సజ్దహ్ లో రెండు చేతుల యొక్క స్థానము ఏమిటో వివరిస్తున్నారు. అది – రెండు అరచేతులను, చేతి వ్రేళ్ళు (విడిగా, విప్పి ఉండేలా కాకుండా) కలిసి ఉండేలా మరియు ఖిబ్లా వైపునకు ఉండేలా చేయాలి. అదే సమయములో మోచేతులను (మోచేయి అంటే భుజపు టెముక మరియు ముంజేయి కలియు భాగము) నేలపై ఆనకుండా మోచేతులను శరీరానికి దూరంగా ఉండేలా, పైకి లేపి ఉంచి సజ్దహ్ చేయాలి.

فوائد الحديث

నమాజు ఆచరిస్తున్న వ్యక్తి (సజ్దహ్ లో) తన రెండు అరచేతులను నేలపై ఉంచాలి. అరచేతులు (సజ్దహ్ యొక్క) ఏడు శరీరభాగాలలో రెండు భాగాలు.

మోచేతులను నేల నుండి పైకి లేపి ఉంచడం మంచిది, మరియు వాటిని అడవి మృగంలా నేలపై విస్తరించడం నమాజు ఆచరణలో మక్రూహ్’గా (అయిష్టమైనదిగా) భావించబడుతుంది.

ఆరాధనలో (ఇబాదత్’లో) శక్తి, బలం మరియు ఆ ఇబాదత్’ను ఆచరించాలనే ప్రబలమైన ఇచ్ఛను ప్రదర్శించడం షరియత్ ప్రకారం సరియైనదే.

నమాజు ఆచరించే వ్యక్తి సజ్దహ్ యొక్క అన్ని శరీర భాగాలపై ఆధారపడి సజ్దహ్ చేసినప్పుడు, ప్రతి భాగానికి ఆ ఇబాదత్ (ఆరాధన) యొక్క హక్కు లభిస్తుంది.

التصنيفات

నమాజ్ పద్దతి