“సుబ్’హానల్లాహ్! ఒక ముస్లిం ఎన్నటికీ అపరిశుద్ధుడు కాడు.”

“సుబ్’హానల్లాహ్! ఒక ముస్లిం ఎన్నటికీ అపరిశుద్ధుడు కాడు.”

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు మదీనా వీధులలోని ఒక వీధిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడం జరిగింది. అపుడు అబూ హురైరహ్ ‘జనాబహ్’ స్థితిలో (అపరిశుద్ద స్థితి: తప్పనిసరిగా తలస్నానం చేసి పరిశుద్ధ పరుచుకోవలసిన స్థితిలో) ఉన్నారు. ఆయన (అక్కడి నుండి మెల్లగా) జారుకుని స్నానం చేసి రావడానికి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను లేకపోవడాన్ని గమనించి, తిరిగి వచ్చినప్పుడు ఇలా అన్నారు: “ఎక్కడికి వెళ్ళిపోయావు ఓ అబూ హురైరహ్?” దానికి ఆయన ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అపరిశుద్ద స్థితిలో ఉండగా మీతో కలిసినాను. నేను గుస్ల్ చేసి (తలస్నానం చేసి) పరిశుద్ధుడిని కానంత వరకు, ఆ స్థితిలో మీ ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేకపోయింది”; అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సుబ్’హానల్లాహ్! ఒక ముస్లిం ఎన్నటికీ అపరిశుద్ధుడు కాడు.”

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హును మదీనాలోని ఒక వీధిలో కలవడం జరిగింది. అపుడు అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు జనాబహ్ స్థితిలో (అపరిశుద్ద స్థితిలో) ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న గౌరవం, పూజ్యభావం కారణంగా అపరిశుద్ద స్థితిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చోవడం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో సంభాషించడం అతనికి ఇష్టం లేకపోయింది. ఆ స్థితిలో తాను అపవిత్రుడిగా ఉన్నాను అని అనుకున్నారు. దాని కారణంగా అతను రహస్యంగా అక్కడి నుండి వెళ్ళిపోయి, తలస్నానం చేసి, తిరిగి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చొన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఎక్కడికి వెళ్ళినావు అని అడిగినారు. అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు తన పరిస్థితి గురించి వివరిస్తూ, జనాబహ్ కారణంగా తాను అపవిత్రంగా ఉన్నందున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చోవడం తనకు ఇష్టం లేకపోయినది అని చెప్పారు. ఆ మాటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యపోయి ఇలా అన్నారు: “నిశ్చయంగా విశ్వాసి పవిత్రుడు మరియు ఎట్టి పరిస్థితిలోనూ అపవిత్రుడు కాడు, అతడు జీవించి ఉన్నా లేదా చనిపోయినా కూడా”.

فوائد الحديث

జనాబహ్ ఒక వ్యక్తిని కేవలం నమాజు చేయకుండా, ఖుర్ఆన్ ను తాకకుండా, మస్జిదులో ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ముస్లింలతో కూర్చోవడం లేదా కలుసుకోవడం నుండి ఇది ఒక వ్యక్తిని నిరోధించదు, లేదా ఒక వ్యక్తిని అపవిత్రం చేయదు.

ఒక విశ్వాసి ఎప్పుడూ పవిత్రుడే, అతడు జీవించి ఉన్నా లేక చనిపోయినా.

ధర్మవేత్తలను, జ్ఞానవంతులను మరియు నీతిమంతులను గౌరవించడం మరియు వారి వద్ద ఉత్తమ రీతిలో కూర్చోవడం, వ్యవహరిచడం.

ఒక సహచరుడు బయలుదేరే ముందు తన నాయకుడి అనుమతి కోరడం షరియత్ ప్రకారం చేయవలసిన పని. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తనకు తెలియకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినందుకు అబూ హురైరా రదియల్లాహు అన్హును మందలించినారు. నిజానికి, అనుమతి కోరడం మంచి వ్యవహరణకు, మర్యాదకు సంకేతం.

ఆశ్చర్యానికి లోనైనపుడు “సుబ్’హానల్లాహ్’ అనడం మంచిది.

చట్టబద్ధమైన ప్రయోజనం ఉన్నప్పుడు, ఒక వ్యక్తి తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి అనుమతి ఉన్నది.

ఒక అవిశ్వాసి అపవిత్రుడిగా భావించబడతాడు. అయితే అతని అపవిత్రత అనేది ఆత్మకు సంబంధమైనది, కారణం అతను దైవవిశ్వాసాన్ని దాచి పెట్టడంలో ఉన్న దుష్టత్వము మరియు లోపము.

ఇమామ్ అన్-నవవి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఈ హదీథులో ఒక విధానం, ఒక సదాచారం కూడా బోధించబడినది: ఒకవేళ ఒక పండితుడు (ఆలిమ్) తనను అనుసరిస్తున్న వ్యక్తి సరైన విధానానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్లు గమనించినట్లైతే, అతనిని దాని గురించి అడగాలి, సరైన విధానాన్ని వివరించాలి, మరియు దాని నియమాన్ని నిబంధనలను వివరించాలి, (అలా అతనిని సరిదిద్దాలి).

التصنيفات

మాలీన్యములను తొలగించటం, గుసుల్