గుసుల్

గుసుల్

2- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘జనాబత్’ స్థితి నుండి గుసుల్ (స్నానం) చేయునపుడు ముందుగా తన రెండు చేతులను కడుక్కునేవారు, తరువాత సలాహ్ కొరకు (నమాజు కొరకు) చేయు విధంగా వుదూ చేసేవారు, తరువాత సంపూర్ణంగా స్నానం చేసేవారు*. వారు తన చేతి వేళ్ళను తల వెంట్రుకల లోనికి జొప్పించి (వెంట్రుకల క్రింది) చర్మమంతా తడిసినది అని సంతృప్తి చెందే దాకా తడి చేసేవారు, తల పైనుండి మూడు సార్లు నీళ్ళు పోసుకునే వారు, తరువాత శరీరంపై నీళ్ళు పోసుకుని స్నానం చేసేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “నేను మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరమూ ఒకే నీటి తొట్టి నుండి, ఒకరి తరువాత ఒకరము నీళ్ళు తీసుకుంటూ స్నానం చేసేవారము.”

3- “శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం*; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”