“నేను ఇస్లాం స్వీకరించే సంకల్పముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాను. అపుడు వారు “రేగు ఆకులు…

“నేను ఇస్లాం స్వీకరించే సంకల్పముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాను. అపుడు వారు “రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” నన్ను ఆదేశించినారు

ఖైస్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “నేను ఇస్లాం స్వీకరించే సంకల్పముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాను. అపుడు వారు “రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” నన్ను ఆదేశించినారు.

[దృఢమైనది]

الشرح

ఖైస్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించే నిమిత్తము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు “రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” ఆదేశించినారు. కారణం రేగు ఆకులు పరిశుభ్రత పొందుట కొరకు ఉపయోగించేవారు, అలాగే వాటికి మంచి సువాసన కూడా ఉంటుంది.

فوائد الحديث

ఒక అవిశ్వాసి ఇస్లాం స్వీకరించునపుడు ముందుగా స్నానం చేయుట షరియత్’లో ఉన్న విషయమే.

ఇస్లాం శరీరానికి సంబంధించి మరియు (అందులోని) ఆత్మకు సంబంధించి శ్రద్ధ వహిస్తుంది.

పరిశుద్ధమైన వస్తువులు నీటిలో పడుట, లేదా నీటితో కలియుట అనేది నీటి యొక్క పరిశుద్ధతను తొలగించదు.

రేగు ఆకుల స్థానములో - శరీరాన్ని శుభ్రపరుచుకొనుటకు ఉపయోగించే ఆధునిక కాలపు సబ్బులు, షాంపులు – మొదలైనవి ఉపయోగించవచ్చును.

التصنيفات

గుసుల్ ను అనివార్యం చేసేవి