“మీలో ఎవరైనా “శుక్రవారము నమాజు కొరకు వస్తున్నట్లయితే, వారు తలస్నానం చేయాలి”

“మీలో ఎవరైనా “శుక్రవారము నమాజు కొరకు వస్తున్నట్లయితే, వారు తలస్నానం చేయాలి”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీలో ఎవరైనా “శుక్రవారము నమాజు కొరకు వస్తున్నట్లయితే, వారు తలస్నానం చేయాలి”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుక్రవారపు నమాజుకు రావాలనుకునే వారు ‘జనాబత్ గుస్ల్’ చేసిన మాదిరిగా గుస్ల్ చేయాలని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ‘జనాబత్ గుస్ల్’ అంటే సంభోగానంతరం చేయు తలస్నానం.

فوائد الحديث

ఇందులో శుక్రవారం గుస్ల్ యొక్క ప్రాధాన్యత చూడవచ్చు. శుక్రవారం నాడు గుస్ల్ చేయడం విశ్వాసి కొరకు ఒక సున్నత్ ఆచరణ, శుక్రవారపు నమాజుకు వెళ్ళడానికి ముందు గుస్ల్ చేయడం ఉత్తమం.

పరిశుభ్రంగా ఉండడం, ఆహ్లాదకరమైన సువాసనను (సెంటును) ఉపయోగించడం ముస్లిం యొక్క నైతికత మరియు మర్యాదలలో భాగము. ముఖ్యంగా శుక్రవారం నాటి జుమా నమాజు సమయములో మరియు అటువంటి సామూహిక కార్యక్రమాలు, నమాజుల సమయంలో ప్రజలను కలిసినప్పుడు మరియు వారితో కలిసి కూర్చున్నప్పుడు దీని ప్రాముఖ్యత మరింత ఎక్కువ అవుతుంది.

ఈ హదీథులో చెప్పబడుతున్న విషయం ఎవరిపైనైతే శుక్రవారపు జుమా నమాజు చదవడం విధి చేయబడినదో వారి కొరకు ఉద్దేశించ బడినది.

ఇందులో శుక్రవారం జుమా నమాజుకు హాజరయ్యే వ్యక్తి శుభ్రంగా ఉండాలని సిఫార్సు చేయబడింది. కనుక, అతడు తన శరీరం నుండి దుర్వాసనలను తొలగించడానికి తలస్నానం చేయాలి, మరియు అతను సువాసనలను ఉపయోగించాలి. అయితే, కనీసం అతడు ఉదూ చేసినా అది అతని కొరకు సరిపోతుంది.

التصنيفات

గుసుల్, జుమా నమాజ్