‘జిక్ర్’ లలో (అల్లాహ్’ను ధ్యానించు విషయాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు,…

‘జిక్ర్’ లలో (అల్లాహ్’ను ధ్యానించు విషయాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని పలుకుట మరియు దుఆలలో అత్యుత్తమమైనది “అల్-హందులిల్లాహ్” (సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే) అని పలుకుట”

జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: ‘జిక్ర్’ లలో (అల్లాహ్’ను ధ్యానించు విషయాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని పలుకుట మరియు దుఆలలో అత్యుత్తమమైనది “అల్-హందులిల్లాహ్” (సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే) అని పలుకుట”.

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క ధ్యానంలో (స్మరణ వాక్యాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” అనడం అని తెలియ జేస్తున్నారు. దాని అర్థము ‘నిజ ఆరాధ్యుడు, అన్ని ఆరాధనలకు ఏకైక అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే’ అని. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వేడుకోలు వచనాలలో అత్యుత్తమమైనది “అల్ హందులిల్లాహ్” అనడం అని తెలియ జేస్తున్నారు. దాని అర్థం సకల ప్రశంసలు, సకల స్తోత్రము, సకల కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ కే శోభిస్తాయి అని. ఈ వాక్యము ‘దాత, ప్రధాత, ప్రసాదించేవాడు పరమ పవిత్రుడైన అల్లాహ్ మాత్రమే’ అనే భావాన్ని గుర్తింపజేస్తుంది. ఆయనకు చెందిన గుణగణాలలో ఆయన సంపూర్ణుడు అనే విషయం తెలియ జేస్తున్నది.

فوائد الحديث

ఇందులో, వీలైనంత ఎక్కువగా “లా ఇలాహ ఇల్లల్లాహ్” అనే తౌహీద్ వాక్యంతో అల్లాహ్ ను స్మరించాలనే ప్రోత్సాహం ఉన్నది మరియు దుఆలలో ఎక్కువగా అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించాలనే ప్రోత్సాహం ఉన్నది.

التصنيفات

అన్ని దుఆలు