"అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి…

"అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి (తఖ్వా), పవిత్రత (శుద్ధత), మరియు సంతృప్తి/సంపద (స్వయం సమృద్ధి) కోసం అడుగుతున్నాను.""

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి (తఖ్వా), పవిత్రత (శుద్ధత), మరియు సంతృప్తి/సంపద (స్వయం సమృద్ధి) కోసం అడుగుతున్నాను.""

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆలలో ఇవి ఉన్నాయి: “ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం కోసం అడుగుతున్నాను,” అంటే సత్యాన్ని తెలుసుకుని దానిని అనుసరించడానికి సరళమైన మార్గం, “భక్తి,” అంటే ఆజ్ఞలను పాటించడం మరియు నిషేధాలను నివారించడం, “పవిత్రత,”అంటే మాటలో లేదా క్రియలో అనుమతించబడని లేదా సముచితమైన వాటికి దూరంగా ఉండటం మరియు “సమృద్ధి”, అంటే ఒక వ్యక్తికి సర్వశక్తిమంతుడు మరియు మహోన్నతుడు అయిన తన ప్రభువు తప్ప మరెవరి అవసరం లేకపోవడం.

فوائد الحديث

ఈ లక్షణాల గౌరవం: మార్గదర్శకం, దైవభక్తి, పవిత్రత మరియు సంపద, మరియు వాటిని వేడుకోవడానికి ప్రోత్సాహం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తనకు తానుగా ప్రయోజనం లేదా హాని చేసుకునే శక్తి కలిగి లేరు మరియు దానిని కలిగి ఉన్నవాడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మాత్రమే.

సృష్టికి ప్రయోజనం, హాని మరియు మార్గనిర్దేశం చేయగల శక్తి ఉన్నవాడు అల్లాహ్ మాత్రమే, ఆయన దగ్గర ఉండే దైవదూత కాదు, పంపబడిన ప్రవక్త కాదు లేదా మరెవరూ కాదు.

التصنيفات

మాసూర్ దుఆలు