సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది.

సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది.

అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఉపవాసానికి సిద్ధమయ్యే ముందు చేసే సహరీ భోజనం తప్పకుండా తినాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రజలను ప్రోత్సహించినారు, ఎందుకంటే ఇందులో అనేక శుభాలు, దీవెనలు మరియు ప్రతిఫలాలు ఉన్నాయి. ఉపవాసం పాటించేందుకు ఉపయోగపడే శక్తిని పొందడానికి, ఉపవాసం కోసం తమను తాము శక్తివంతం చేసుకోవడానికి మరియు ఉపవాసం యొక్క కష్టాలను తగ్గించడానికి రాత్రిపూట లేచి (ఖియాముల్ లైల్) నమాజులో నిలబడాలని కూడా ఆయన ప్రజలను ప్రోత్సహించారు.

فوائد الحديث

సహ్రీ చేయడం ఇష్టప్రాయమైనది మరియు దాన్ని చేయడం ద్వారా షరీఅహ్ ఆజ్ఞను అనుసరించడమవుతుంది.

ఇబ్నె హజర్ "ఫత్హుల్ బారీ"లో ఇలా తెలిపారు: సహరీలో శుభము అనేక విధాలుగా లభిస్తుంది: వాటిలో సున్నతును అనుసరించడం, గ్రంథ ప్రజల ఉపవాసానికి భిన్నంగా ఉండటం, ఆరాధన కోసం తనను తాను బలోపేతం చేసుకోవడం, శక్తిని వృద్ధి చేసుకోవడం, ఆకలి వల్ల కలిగే చెడు ప్రవర్తనను నివారించడం, పేదలకు దానధర్మాలు ఎక్కువగా చేసే అవకాశం, దుఆ మరియు దిక్ర్ ఎక్కువగా చేసుకునే అవకాశం, ఉపవాసానికి ముందు రాత్రి నిద్రకుపక్రమించక ముందే చేసుకోవలసిన నియ్యతు మరిచిపోతే, దానిని (సంకల్పాన్ని) సరిచేసుకోవడం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయన ఎప్పుడూ ఆజ్ఞను దాని వెనుక ఉన్న వివేకంతో, హేతువుతో కలిపి వివరించేవారు. దీని వల్ల మనసు సంతృప్తి చెందుతుంది, అలాగే ఇస్లామీయ ధర్మశాస్త్రం (షరీఅత్) యొక్క ఉన్నత స్థానం మరియు గొప్పతనం స్పష్టంగా అర్థము అవుతుంది.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "సహరీ" అనేది మనిషి తినే లేదా త్రాగే అత్యల్ప పరిమాణంతోనైనా సరే, పూర్తవుతుంది (అంటే సహహీ సమయం ముగియక ముందే ఒక ముద్ద తిన్నా లేక ఒక గుక్క నీళ్ళు త్రాగినా సహరీ చేసినట్లే).

التصنيفات

ఉపవాసాల సున్నతులు