إعدادات العرض
. .
. .
అబూ హాజిమ్ ఇలా పలికినారు: నేను అబూ హురైరహ్ రదియల్లాహు అన్హుతో ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నాను, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అతను ఇలా ఉల్లేఖించడం నేను విన్నాను: ఇస్రాయీలు సంతతివారిని ప్రవక్తలు పాలించేవారు. ఒక ప్రవక్త మరణించినప్పుడు, మరొక ప్రవక్త అతని స్థానంలో వచ్చేవారు. నిశ్చయంగా, నా తరువాత ఏ ప్రవక్తా రాడు, కానీ అనేకమంది ఖలీఫాలు (పాలకులు) ఉంటారు." దానికి వారు ఇలా అడిగారు: "అపుడు మేము ఏమి చేయాలి అని మీ ఆదేశం?" దానికి ఆయన ﷺ ఇలా అన్నారు: "మొదటివారికి (ఖలీఫాకు) బైఅత్ (విశ్వాస ప్రతిజ్ఞ) చేయండి, తరువాత వారికీ (వచ్చిన ఖలీఫాకూ) చేయండి. వారికి వారి హక్కులను ఇవ్వండి. ఎందుకంటే, అల్లాహ్ వారికి అప్పగించిన బాధ్యత గురించి వారిని ప్రశ్నించనున్నాడు."
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල ئۇيغۇرچە Hausa Kurdî Português தமிழ் Kiswahili অসমীয়া ગુજરાતી Nederlands മലയാളം Română Magyar ქართული Moore ಕನ್ನಡ Svenska Македонски ไทย Українськаالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: "ఇస్రాయేలు సంతతివారిని ప్రవక్తలు పాలించేవారు. వారు ప్రజల వ్యవహారాలను పాలకుల్లా నిర్వహించేవారు. ప్రతిసారి ప్రజల మధ్య అవినీతి (దుష్టత) ఏర్పడినప్పుడు, అల్లాహ్ వారి విషయాలను సరిదిద్దడానికి, ధార్మిక ఆదేశాలలో వారు చేసిన మార్పులు చేర్పులను తొలగించడానికి మరో ప్రవక్తను పంపేవాడు. నా తరువాత ఇక ప్రవక్తలు ఉండరు. నా తరువాత ఖలీఫాలు (పాలకులు) ఉంటారు, వారు ఒకరి కంటే ఎక్కువమంది అవుతారు. వారి మధ్య విభేదాలు, కలహాలు కలుగుతాయి. దానికి సహాబాలు ఇలా అడిగారు: "అపుడు ఏమి చేయమని మీరు మాకు ఆదేశిస్తున్నారు?" దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ఖలీఫాకు బైఅత్ (ప్రతిజ్ఞ) చేసిన తరువాత, మరొక ఖలీఫాకు కూడా బైఅత్ చేయబడితే, మొదటి ఖలీఫాకు చేసిన బైఅత్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది; రెండవదాన్ని చేయడం అనుచితం, అతడు దాన్ని కోరడం కూడా నిషిద్ధం. పాలకులకు వారి హక్కులను ఇవ్వండి, వారికి విధేయులుగా ఉండండి, అల్లాహ్‌కు అవిధేయత కలిగించే విషయాలలో తప్ప, మిగతా విషయాల్లో వారిని అనుసరించండి. ఎందుకంటే, అల్లాహ్ వారికి అప్పగించిన బాధ్యత గురించి వారిని ప్రశ్నిస్తాడు, వారి చర్యలకు వారిని బాధ్యత వహింపజేస్తాడు."فوائد الحديث
ప్రజలు తమ వ్యవహారాలను సరిగ్గా నిర్వహించడానికి, వారిని సన్మార్గంలో నడిపించడానికి వారి కొరకు ఒక ప్రవక్త లేదా ఖలీఫా అవసరం ఉంది.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఇక ప్రవక్తలు లేరు.
న్యాయబద్ధంగా అధికారంలోకి వచ్చిన పాలకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవద్దని తీవ్రమైన హెచ్చరిక చేయబడింది.
ఒకేసారి ఇద్దరు ఖలీఫాలకు (పాలకులకు) బైఅత్ (విశ్వాస ప్రతిజ్ఞ) చేయడం అనుమతించబడలేదు.
పాలకుడి బాధ్యత చాలా గంభీరమైనది. తాను పరిపాలించిన ప్రజల గురించి అల్లాహ్ ఆ పాలకుడిని ప్రశ్నిస్తాడు.
ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ధార్మిక విషయాలను ప్రాపంచిక విషయాల కంటే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. ఎందుకంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాలకుడి హక్కులను నెరవేర్చాలని ఆదేశించారు. ఇది ధర్మాన్ని నిలబెట్టడంలో, కలహాలు మరియు దుష్టతను నివారించడంలో సహాయపడుతుంది. తన స్వంత హక్కులు కోరడాన్ని ఆలస్యం చేయడం వలన అవి రద్దు కావు. ఎందుకంటే అల్లాహ్ వాటిని ఇచ్చి తీరతానని, అవసరమైతే పరలోకంలోనైనా వాటిని నెరవేర్చుతానని వాగ్దానం చేశాడు.
ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రవక్తత్వానికి ఒక సూచిక, చిహ్నము. ఎందుకంటే ఆయన తరువాత అనేక మంది ఖలీఫాలు వచ్చారు—వారిలో కొందరు ధర్మపరులు, మరికొందరు అధర్మపరులు—వారు ఒకరి తరువాత మరొకరు ముస్లిం సమాజాన్ని పరిపాలించారు.
التصنيفات
పూర్వ సమాజాల గాధలు మరియు స్థితులు