“విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ,…

“విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ, పరస్పర సానుభూతి చూపుకునే విషయములోనూ – వారంతా ఒకే శరీరం లాంటి వారు. శరీరంలో ఏదైనా అంగానికి బాధ కలిగితే మిగతా శరీరం మొత్తం నిద్రలేమితో, జ్వరంతో బాధపడుతుంది.”

ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ, పరస్పర సానుభూతి చూపుకునే విషయములోనూ – వారంతా ఒకే శరీరం లాంటి వారు. శరీరంలో ఏదైనా అంగానికి బాధ కలిగితే మిగతా శరీరం మొత్తం నిద్రలేమితో, జ్వరంతో బాధపడుతుంది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో విశ్వాసులలో ఒకరిపట్ల మరొకరి తీరు, వారి వైఖరి, దృక్పధం ఎలా ఉండాలి అనే దాని గురించి విశదీకరిస్తున్నారు. వారు పరస్పరం ఎదుటి వారికి మేలు జరగడాన్ని ఇష్టపడాలి, పరస్పరం సహాయం చేయడానికి, చేయూత నివ్వడానికి ఎప్పుడూ ముందుండాలి. వారిలో ఒకరికి ఏదైనా కష్టం, ఆపద, కీడు, బాధ కలిగితే ఎదుటి వారు ఆ బాధకు ప్రతిస్పందించాలి. మరో మాటలో వారు ఒకే శరీరం లాగా వ్యవహరించాలి - ఎలాగైతే శరీరంలో ఒక అంగము జబ్బు పడితే మొత్తం శరీరం నిద్రలేమితో, జ్వరంతో ప్రతిస్పందిస్తుందో అలాగ.

فوائد الحديث

ముస్లింల హక్కులు గౌరవించబడాలి; మరియు వారి మధ్య సహకారం, పరస్పర కరుణను, ప్రేమాభిమానాలను ప్రోత్సహించాలి.

విశ్వాసుల మధ్య అన్ని వేళలా పరస్పరం ప్రేమ, సహాయం, చేయూత, సానుభూతి ఉండాలి.

التصنيفات

ఇస్లాం