: . .

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కష్టకాలంలో ఇలా పలికేవారు: "లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్ అజీముల్ హలీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుల్ అర్షిల్ అజీమ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ రబ్బుస్సమావాతి వ రబ్బుల్ అర్ది, వ రబ్బుల్ అర్షిల్ కరీమ్ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహాన్నతుడు, మహాసహనశీలుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహా సింహాసనానికి అధిపతి. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు మరియు ఘనమైన సింహాసనం యొక్క అధిపతి)."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రమైన బాధ, కష్ట సమయాలలో ఇలా పలికేవారు: "అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు." అంటే, నిజానికి, ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు; "ఆయన మహోన్నతుడు" అంటే, ఆయన స్థితిలో, లక్షణాలలో, కార్యాలలో గొప్పతనాన్ని కలిగి ఉన్నవాడు; "అత్యంత సహనశీలుడు" అంటే, పాపి చేసిన తప్పులకు వెంటనే శిక్షించడు; ఆయన ఎంతో శక్తి కలిగి ఉన్నా, అతడిని క్షమించవచ్చు లేదా ఆలస్యంగా శిక్షించవచ్చు. ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు. "అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహా సింహాసనానికి అధిపతి" అంటే, ఆయన మహా సింహాసనాన్ని సృష్టించినాడు; "అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయనే ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు" అంటే, ఆయన వాటిని సృష్టించినాడు, వాటిలో ఉన్న ప్రతిదానికీ అధిపతి, నిర్వహణదారుడు, పాలకుడు ఆయనే తనకు తోచిన విధంగా వాటిని నియంత్రిస్తాడు; "ఘనమైన సింహాసన అధిపతి" అంటే, ఆయన మహా సింహాసనాన్ని సృష్టించినాడు.

فوائد الحديث

ప్రమాదాలు, కష్టాలు, విపత్తులు వచ్చినప్పుడు, తక్షణమే అల్లాహ్ వైపు మరలి, ఆయనను దుఆతో ఆశ్రయించాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం పై ఉంది.

కష్టకాలంలో పై దిక్ర్ (అల్లాహ్‌ను స్మరించడము)తో దుఆ చేయడం అనేది ముస్లింల కొరకు ప్రోత్సహించబడింది (ముస్తహబ్):

అర్రహ్మాన్ (అల్లాహ్) యొక్క అర్ష్ (మహాసింహాసనం) — ఆయన దాని మీద అధిపతిగా ఆశీనుడై ఉన్నాడు — అది సృష్టిలో అత్యున్నతమైనది, అతి పెద్దది, అతి గొప్పది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం దానిని "అజీమ్" (గొప్పది), "కరీమ్" (ప్రతిష్ఠాత్మకమైనది) అని వర్ణించారు.

ఇక్కడ ఆకాశాలు మరియు భూమిని ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది, ఎందుకంటే అవి మన కంటికి కనపడే అత్యంత గొప్ప సృష్టిరాశులు కావడం వలన.

అత్తయిబీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ స్తోత్రాన్ని "రబ్బ్" (ప్రభువు) అనే పదంతో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే కష్టాలను తొలగించడంలో 'రబ్బ్'గా పేర్కొనడమే (పోషణ, సంరక్షణ, దయ చూపడం) తగినది. ఇందులో "తహ్లీల్" (లా ఇలాహ ఇల్లల్లాహ్) ఉంది, ఇది తౌహీద్ (ఏకత్వ విశ్వాసం) ను సూచిస్తుంది - అది అల్లాహ్ యొక్క పవిత్రత, మహిమకు మూలం. ఇందులో "అజీమ్" (గొప్పతనం) ఉంది, ఇది అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తిని సూచిస్తుంది. ఇందులో "హలీమ్" (సహనశీలుడు) అనే లక్షణం ఉంది, ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది. ఎందుకంటే, ఏమీ తెలియని వ్యక్తి నుండి సహనం, ఉదారత ఊహించలేం. ఈ రెండూ - సహనం, ఉదారత - అల్లాహ్ యొక్క ఘనమైన లక్షణాలకు మూలం.

التصنيفات

కఠినమైన సమయాల్లో పఠించే దుఆలు