“ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట,…

“ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త్ర సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని శపించడం, అవమానించడం, దూషించడం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించారు; ఇది ఒక విధమైన అనైతికత, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు అవిధేయత చూపుట అవుతుంది; మరియు ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడితో పోరాడటం ఒక అవిశ్వాస చర్య, అయితే అది “కుఫ్ర్ అస్గర్’ అవుతుంది (తక్కువస్థాయి కుఫ్ర్ – చిన్నపాటి అవిశ్వాసము).

فوائد الحديث

ఒక ముస్లిం యొక్క గౌరవాన్ని, మరియు అతని ప్రాణాన్ని పరిరక్షించుట, ఆదరించుట మరొక ముస్లిం పై విధి.

అన్యాయంగా ఒక ముస్లిం ను అవమానించడం ఎంతటి ఘోరపరిమాణానికి దారి తీస్తుందో ఇందులో చూడవచ్చు. అలా అన్యాయంగా ఒక ముస్లిం ను అవమానించినవాడు పాపానికి ఒడిగట్టిన వాడు అవుతాడు.

ఒక ముస్లిం ను అవమానించడం, అతనితో కొట్లాటకు, యుద్ధానికి దిగడం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది, మరియు క్షీణింపజేస్తుంది.

కొన్ని ఆచరణలు అవిశ్వాసంగా పరిగణించబడినాయి, ఆ ఆచరణలు ఒక ముస్లింను ఇస్లాం నుండి బహిష్కరించి అతడిని అవిశ్వాసిగా మార్చివేసేటంతటి తీవ్రస్థాయి అవిశ్వాసం క్రిందకు రానప్పటికీ.

ఇక్కడ అవిశ్వాసం అంటే అహ్లె సున్నహ్ అందరి ఏకాభిప్రాయం ప్రకారం, ఇస్లాం పరిధి నుండి బహిష్కరించే అవిశ్వాసం కాదు. ఇది ‘చిన్నపాటి అవిశ్వాసం’ (కుఫ్ర్ అల్ అస్గర్) అనబడుతుంది. ఎందుకంటే సూరతుల్ హుజురాత్ (49:9) ఆయతులో అల్లాహ్ “మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే, వారిద్దరి మధ్య సంధి చేయించండి....” అని పేర్కొని, ముస్లిములు ఒకరితో నొకరు కలహించుకున్నప్పటికీ, ఒకరి నొకరు దూషించుకున్నప్పటికీ వారు ధర్మములో సోదరులే అని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ విశ్వాసుల మధ్య విశ్వాసపు సోదరభావాన్ని స్థాపించాడు.

التصنيفات

సద్గుణాలు మరియు పద్దతులు, దుర్గుణాలు