. : . : . : . : . :

. : . : . : . : . :

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "‘ఒక ముస్లింకి మరొక ముస్లిం పై ఆరు హక్కులు ఉన్నాయి. ‘ఒకటి అతన్ని కలిసినప్పుడు సలాం చేయాలి, రెండు : అతను నిన్ను ఆహ్వానించినప్పుడు దాన్ని స్వీకరించాలి. మూడు : అతను నిన్ను సలహా కోరితే అతనికి మేలైన సలహా ఇవ్వాలి. నాలుగు : తుమ్మినప్పుడు అల్హందులిల్లాహ్ పలికితే దానికి యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పాలి. ఐదు : అతను జబ్బు పడినప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు వెళ్ళి పరామర్శించాలి. ఆరు : చనిపోయినప్పుడు అతని జనాజా వెంట వెళ్ళాలి

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఒక ముస్లిం మీద మరో ముస్లిం హక్కులు ఆరు ఉన్నాయని ప్రవక్త ﷺ స్పష్టం చేసినారు. అవి: మొదటి హక్కు: ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కలిసినప్పుడు, "అస్సలాము అలైకుం" (మీపై శాంతి ఉండుగాక) అని సలాం చెప్పాలి. దానికి అతను కూడా "వఅలైకుమ్ అస్సలాం" (మీపై కూడా శాంతి ఉండుగాక) అని జవాబు ఇవ్వాలి. రెండవ హక్కు: ఒక ముస్లిం తన సహోదరుడిని వలీమా (విందు) లేదా ఇతర (ధర్మబద్ధమైన) శుభకార్యాలకు పిలిస్తే, ఆ ఆహ్వానాన్ని స్వీకరించి, హాజరు కావాలి. మూడవ హక్కు: సోదరుడు సలహా అడిగితే, నిజాయితీగా, దొంగదనమూ లేకుండా, మోసం చేయకుండా అతనికి మంచి సలహా ఇవ్వాలి. నాల్గవ హక్కు: ఒక ముస్లిం తుమ్మినప్పుడు, అతడు "అల్‌హమ్దు లిల్లాహ్" (అల్లాహ్‌ కే సకల స్తుతులు) అని పలకాలి. అప్పుడు నీవు అతనికి "యర్హముకల్లాహ్" (అల్లాహ్ నీపై దయజూపుగాక) అని చెప్పాలి. ఆయన కూడా దానికి ప్రతిగా "యహ్దీకుముల్లాహ్ వయుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గదర్శనం చేయుగాక, మీ పరిస్థితిని మంచిగా మార్చుగాక) అని చెప్పాలి. ఐదవ హక్కు: ఒక ముస్లిం అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతడిని పరామర్శించాలి, అతడి ఆరోగ్యం కోసం దుఆ చేయాలి. ఆరవ హక్కు: ఒక ముస్లిం మరణిస్తే, అతడి జనాజా పాల్గొనాలి, అతడి పై జనాజా నమాజ్ చేయాలి, అతడిని సమాధిలో ఉంచే వరకూ అతడి జనాజా వెంట వెళ్లాలి.

فوائد الحديث

షౌకాని ఇలా చెప్పినారు: "ఇక్కడ ‘ముస్లిం హక్కు’ అంటే, అది వదలకూడదు అని అర్థం. అందులో ఉండే చర్యలు లేదా ఫర్జ్ (తప్పనిసరి విధి) అయి ఉండవచ్చు, లేదా ముందూబ్ ముఅక్కద్ (బలమైన సిఫార్సు) అయి ఉండవచ్చు, ఇవి ఫర్జ్‌కు అంటే తప్పనిసరి విధి ఆచరణలకు సమీపంగా ఉండటం వలన వాటిని వదిలి వేయకూడదని భావించాలి."

ఒక వ్యక్తి సలాం చెప్పినప్పుడు, అతనికి సమాధానం ఇవ్వడం ఆ వ్యక్తి కొరకు తప్పనిసరి (ఫర్జ్ అయిన్) అయి పోతుంది. ఒక సమూహానికి సలాం చెప్పితే, వారిలో ఎవరైనా ఒకరు సమాధానం ఇస్తే సరిపోతుంది.

అనారోగ్యంతో ఉన్న ముస్లిం సహోదరుడిని పరామర్శించడం అనేది మిగిలిన ముస్లింల మీద అతడికి ఉన్న హక్కులలో ఒకటి. ఎందుకంటే, ఇది అతని మనసులో ఆనందాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఫర్ద్ కిఫాయా (సామూహిక బాధ్యత).

ముస్లిం సహోదరుడు ఇచ్చే ఆహ్వానానికి హాజరుకావడం తప్పనిసరి, అయితే ఆ ఆహ్వానంలో పాపం లేదా తప్పు ఉండ కూడదు. వివాహ విందు (వలీమా)కి పిలిచినప్పుడు: ముహద్దిసులలో చాలామంది అభిప్రాయం ప్రకారం, హాజరు కావడం తప్పనిసరి (ఫర్జ్), కానీ షరియతు ప్రకారం సరైన కారణం ఉంటే మినహాయింపు పొందవచ్చు. ఇతర విందులకు: చాలామంది ఉలమాల అభిప్రాయం ప్రకారం, హాజరుకావడం మంచిది (ముస్తహబ్), కానీ తప్పనిసరి కాదు.

తుమ్మిన వ్యక్తి "అల్‌హమ్దు లిల్లాహ్" (అల్లాహ్‌ కే సకల స్తుతులు) అని చెప్పినప్పుడు, వినినవారు అతనికి "యర్హముకల్లాహ్" (అల్లాహ్ నీపై దయజూపుగాక) అని పలకడం తప్పనిసరి.

ఇస్లామీయ షరీఅతు (ధర్మశాసనం) యొక్క సంపూర్ణత,

సమాజంలో బంధాలను, విశ్వాసాన్ని (ఈమాన్‌ను), మరియు వ్యక్తుల మధ్య ప్రేమను బలపరిచే విషయంలో చూపే శ్రద్ధను ఇది సూచిస్తుంది.

"(ఫసమ్మిత్‌హు)" అనే పదానికి వివరణ: కొన్ని గ్రంథాల్లో ఇది "ఫషమ్మిత్‌హు" అని కూడా ఉంది. "సీన్" (س) మరియు "షీన్" (ش) తో ఉన్న పదాలు: "తష్మీత్" అంటే: తుమ్మినవాడికి మంచి, దీవెన కోసం దుఆ చేయడం. తష్మీత్ అనే పదానికి మరో అర్థం:

అల్లాహ్ నిన్ను శత్రువుల ఆనందానికి దూరంగా ఉంచుగాక అంటే నీ శత్రువు నిన్ను చూసి ఆనందించే పరిస్థితి నుండి నిన్ను కాపాడుగాక. "తస్మీత్" అంటే: అల్లాహ్ నిన్ను తిన్నగా ఋజుమార్గంలో నడిపించుగాక.

التصنيفات

స్నేహము,శతృత్వము యొక్క ఆదేశములు, తుమ్మే,మరియు ఆవులించే పద్దతులు