إعدادات العرض
“అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి…
“అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili ગુજરાતી پښتو አማርኛ Oromoo ไทย Română മലയാളം Deutsch नेपाली Кыргызча ქართული Moore Magyarالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదాన్’కు మరియు ఇఖామహ్’కు మధ్య చేయు దుఆ యొక్క ఘనతను వివరించారు మరియు ఇది తిరస్కరించబడదని; సమాధానం పొందే అవకాశం ఉందని, కాబట్టి ఈ సమయంలో అల్లాహ్’ సన్నిధిలో దుఆ చేయండి అని పేర్కొన్నారు.فوائد الحديث
దుఆ చేయు సమయాలలో ఈ సమయం (అదాన్ మరియు అఖామత్’ల మధ్య సమయం) యొక్క ఘనత, ప్రాముఖ్యత తెలుస్తున్నది.
దుఆ చేయు వ్యక్తి, దుఆ యొక్క నియమాలకు, దుఆ చేయు విధానానికి కట్టుబడి ఉండి, దుఆలు స్వీకరించబడే సమయాల మరియు ప్రదేశముల ఘనతను ఎరిగి, అల్లాహ్ పట్ల అవిధేయతకు దూరంగా ఉంటూ, సందేహాలలో, అనుమానాలలో పడకుండా జాగ్రత్త వహిస్తూ, అల్లాహ్ పట్ల ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మరియు పవిత్రమైన ఆలోచన కలిగి ఉంటే – అపుడు ఇన్-షా-అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే) అతని దుఆకు వెంటనే సమాధానం లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది.
దుఆలకు సమాధానం లభించడం గురించి అల్-మునావి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “దుఆలకు సమాధానం లభించడం అంటే: దుఆ చేయు వ్యక్తి, దుఆ యొక్క అన్ని మూలస్థంభాలను, షరతులను, దుఆ చేయు విధివిధానాలను నెరవేర్చాలి. వాటిలో దేనినైనా నెరవేర్చడంలో విఫలమైతే, దానికి అతడు మాత్రమే నిందార్హుడు తప్ప మరెవ్వరూ కాదు.
దుఆకు (అల్లాహ్ తరఫు నుండి) సమాధానం లభించుట: అతని దుఆకు వెంటనే సమాధానం లభించవచ్చు; లేదా అతనికి కలగబోయే చెడు నుండి సమానమైన చెడు అతని నుండి దూరం చేయబడుతుంది, లేదా అతని దుఆ అతని (పరలోక జీవితము) కొరకు పరలోకములో జమచేసి ఉంచబడుతుంది.