إعدادات العرض
ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని…
ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."
الترجمة
العربية Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Kurdî Tiếng Việt Nederlands Kiswahili অসমীয়া ગુજરાતી සිංහල Magyar ქართული Hausa Română ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ বাংলা Македонскиالشرح
ఈ హదీథులో - ఖుర్’ఆన్ ను అధ్యయనం చేసిన వ్యక్తిని – అది ముస్’హఫ్ ను (ఖుర్’ఆన్ యొక్క ప్రతిని) చూసి చదవడం ద్వారా కావచ్చు, లేక ఖుర్’ఆన్ ను కంఠస్థం చేయడం ద్వారా కావచ్చు - ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మోకాళ్ళను తాడుతో కట్టిన ఒంటె యజమానితో పోల్చారు. అతను దానిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను దానిని తన అధీనంలో ఉంచుకుంటాడు, కానీ అతను దాని తాడును విప్పితే, అది తప్పించుకుని వెళ్ళిపోతుంది. అదే విధంగా ఖుర్’ఆన్ సహచరుడు తాను అధ్యయనం చేసిన దానిపై, లేక తాను కంఠస్థం చేసిన దానిపై స్థిరంగా ఉంటే అతడు దానిని గుర్తుంచుకుంటాడు; మరియు అతను దానిని నిర్లక్ష్యం చేస్తే, అతను దానిని మరచిపోతాడు. కనుక ఖుర్’ఆన్ తో సంబంధం క్రమం తప్పకుండా నిర్వహించబడినంత వరకు, కంఠస్థం చెక్కుచెదరకుండా ఉంటుంది.فوائد الحديث
ఈ హదీథులో ఖురాన్ కంఠస్థం చేసి పారాయణం చేయమని ప్రజలను ప్రోత్సహించడం మరియు దానిని మరచిపోకుండా జాగ్రత్త వహించాలి అనే హితబోధ ఉన్నది.
ఖురాన్ ను నిరంతరం పఠించడం వల్ల నాలుక మృదువుగా మారుతుంది మరియు పఠించడం సులభం అవుతుంది. ఎవరైనా దానిని పఠించడం వదిలివేస్తే, పఠనం కష్టంగా మరియు భారంగా మారుతుంది.
అల్-ఖాదీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఖుర్’ఆన్ సహచరుడు” (సాహిబ్ అల్ ఖుర్’ఆన్) అంటే దానితొ పరిచయం ఉన్నవాడు. “సాహచర్యము” (అల్-ముసాహిబహ్) అంటే దానితో అనుసరణ, అనుబంధం కలిగిఉండడం. “ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి యొక్క సహచరుడు” లేక “స్వర్గ సహచరులు” (అస్’హాబుల్ జన్నహ్), లేక “నరకాగ్ని సహచరులు” (అస్’హాబన్నార్) అని సూచించడం కూడా ఇదే అర్థములో వస్తుంది.
ప్రజలను ఇస్లాం వైపుకు పిలిచే పద్ధతుల్లో ఒకటి ఉపమానాలను ఉపయోగించడం.
ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటెలను ప్రత్యేకంగా ప్రస్తావించారు, ఎందుకంటే అవి మచ్చిక చేసుకోవడానికి అత్యంత కష్టతరమైన పెంపుడు జంతువులు. అవి వాటి స్వేచ్ఛకు అలవాటు పడిన తర్వాత వాటిపై తిరిగి నియంత్రణ సాధించడం సవాలుతో కూడుకున్న విషయం.