“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ విషయం లోనైనా సౌమ్యత, దయ, కనికరం కలిగి ఉండటమనేది దానిని మరింత…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ విషయం లోనైనా సౌమ్యత, దయ, కనికరం కలిగి ఉండటమనేది దానిని మరింత అలంకృతం చేస్తుంది. అలాగే ఏ విషయంలో నుండి అయినా వీటిని తొలిగించి వేస్తే అది లోపభూయిష్టం అవుతుంది.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రజియల్లాహు అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ విషయం లోనైనా సౌమ్యత, దయ, కనికరం కలిగి ఉండటమనేది దానిని మరింత అలంకృతం చేస్తుంది. అలాగే ఏ విషయంలో నుండి అయినా వీటిని తొలిగించి వేస్తే అది లోపభూయిష్టం అవుతుంది.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మాటలలో మరియు ఆచరణలలో సౌమ్యత, దయ, కనికరం, నిదానం – ఇవి విషయాలను మంచివిగా చేస్తాయి, సౌందర్యవంతం చేస్తాయి, పరిపూర్ణం చేస్తాయి, ఆకర్షణీయంగా చేస్తాయి. వీటిని ఆచరించే వ్యక్తి (సమాజములో) వీటి అవసరాన్ని పసిగట్ట వచ్చు. ఏ విషయం లోనైనా దయ, కరుణ, సౌమ్యత లేక పోవడం దానిని నికృష్టంగానూ, వికారంగానూ మారుస్తుంది. అవి లేని వ్యక్తి వాటి అవసరాన్ని అంత త్వరగా, తేలికగా గుర్తించడు. గుర్తించినా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తరువాత గుర్తిస్తాడు.

فوائد الحديث

ఈ హదీసులో వ్యక్తులు దయ, కరుణ, నిదానం, సౌమ్యత కలిగి ఉండాలనే హితబోధ ఉన్నది.

సౌమ్యత, కరుణ, మరియు దయాపూరిత వ్యవహారం, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సౌందర్యవంతం చేస్తాయి. ఈ లక్షణాలు ఈ ప్రాపంచిక జీవితంలోనూ, పరలోక జీవితంలోనూ అతనికి లభించే ప్రతి శుభానికీ కారణం అవుతాయి.

التصنيفات

సద్గుణాలు