"మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ…

"మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే."

ఉబైదుల్లాహ్ బిన్ మిహ్సన్ అల్-అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే."

[ప్రామాణికమైనది]

الشرح

ఓ ముస్లింలారా! మీలో ఎవరైనా, ఉదయం లేచినపుడు, ఆరోగ్యంగా, అనారోగ్యం లేకుండా ఉంటాడో; తనలో, తన కుటుంబంలో, తనపై ఆధారపడినవారిలో, తన మార్గంలో సురక్షితంగా, భయపడకుండా ఉంటాడో; ఆ రోజుకు సరిపడా న్యాయబద్ధమైన ఆహారం కలిగి ఉంటాడో, ప్రపంచం మొత్తం అతని కోసం సమకూర్చబడినట్లుగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినారు.

فوائد الحديث

మనిషికి ఆరోగ్యం, భద్రత, ఉపాధి (ఆహారం/జీవనోపాధి) యొక్క అవసరాన్ని స్పష్టంగా వివరించబడింది.

బానిసగా ఉన్నా సరే, మహోన్నతుడైన అల్లాహ్ తనకు ప్రసాదించిన అనుగ్రహాలకు బదులుగా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయనను ప్రశంసించాలి.

ఇస్లాం బోధనల ప్రకారం, ఈ లోకంలో సంతృప్తి (contentment) కలిగి ఉండటం మరియు ప్రాపంచిక ఆకాంక్షలకు దూరంగా ఉండటం పై ప్రోత్సహించబడింది.

التصنيفات

వైరాగ్యము మరియు భీతి