రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అని పలికినప్పుడు, మాలో ఎవ్వరూ కూడా తమ నడుమును…

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అని పలికినప్పుడు, మాలో ఎవ్వరూ కూడా తమ నడుమును వంచేవారు కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా లోకి పూర్తిగా వెళ్ళేంత వరకు. ఆ తర్వాత మేము ఆయన వెంబడి సజ్దా చేసేవారము

అబ్దుల్లాహ్ ఇబ్న్ యజీద్ అల్-ఖత్మీ ఉల్లేఖన: బరా, అతను అసత్యవాది కాదు నాకు దీనిని ఉల్లేఖించి, ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అని పలికినప్పుడు, మాలో ఎవ్వరూ కూడా తమ నడుమును వంచేవారు కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా లోకి పూర్తిగా వెళ్ళేంత వరకు. ఆ తర్వాత మేము ఆయన వెంబడి సజ్దా చేసేవారము.

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

الشرح

సత్యవంతుడైన బర్రా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ రుకూ నుండి తల పైకి లేపి ‘సమియల్లాహు లిమన్ హమిద’ పలికిన తరువాత, ఆయన వెనుక ఉన్నవారు (రుకూ నుండి లేచి నిలబడి) అలాగే నిలబడే వారు; వారిలో ఎవ్వరూ కూడా సజ్దా కోసం వెంటనే వంగేవారు కాదు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన నుదుటిని నేలపై పెట్టిన తర్వాతనే (సజ్దా లోకి పూర్తిగా వెళ్ళన తర్వాతనే) వారు కూడా ఆయన వెనుక సజ్దా చేసేవారు.

فوائد الحديث

నమాజులో సహాబాలు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించే విధానం ఏమిటంటే, ఆయన సజ్దా చేసేంత వరకు వారు నిలబడిన స్థితి నుండి సజ్దాలోకి వెళ్ళేవారు కాదు.

ఇమాం ఇబ్న్ దఖీఖ్ అల్-ఈద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరంతరం ప్రశాంతతను పాటించేవారు అనడానికి ఇది ఒక ఆధారం.

ఇమామును అనుసరించే విషయంలో ఇమాము వెనుక నమాజు చేస్తున్న వారి (మఅమూమ్) కొరకు నాలుగు స్థితులు ఉంటాయి: 1- ఇమాముతో పోటీ పడుతున్నట్లుగా ఆచరించడం: అనగా ఇమాము కంటే ముందుగా ఆ ఆచరణను ప్రారంభించడం, అంటే ఇమామ్ ఒక రుకున్ (నమాజులోని ఒక ముఖ్యమైన భాగం) లోకి ప్రవేశించక ముందే మఅమూమ్ ఆ రుకున్ లోకి ప్రవేశించడం. ఉదాహరణకు: ఇమామ్ రుకూ చేయకముందే రుకూ చేయడం, లేదా ఇమామ్ సజ్దా చేయకముందే సజ్దా చేయడం. ఇది హరామ్. నిషేధం గురించి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఇమాము కంటే ముందు చేస్తే, అతని నమాజు బాతిల్ (నిర్వీర్యం) అవుతుంది, అతను ఒక రుకున్ ను ఇమాము కంటే ముందు పూర్తి చేసినా లేదా రుకున్ లోకి ఇమాము కంటే ముందు వెళ్ళినా సరే. ఒకవేళ ఈ పోటీ తక్బీరు తహ్రీమాలో జరిగితే, అతని నమాజు ప్రారంభమే కాదు (చెల్లదు), మరియు అతను మళ్ళీ మొదటి నుండి నమాజు చేయడం తప్పనిసరి. 2- ఇమాముతో పాటుగా ఆచరించడం: అనగా ఇమాముతో పాటుగా ఉండటం, అతని రుకూతో పాటు రుకూ చేయడం, అతని సజ్దాతో పాటు సజ్దా చేయడం మరియు అతనితో పాటే లేవడం. ఇది కనీస పక్షంలో మక్రూహ్ (అయిష్టకరమైనది) అవుతుంది మరియు స్పష్టమైన ఆధారాల ప్రకారం ఇది కూడా హరామ్. ఒకవేళ తక్బీరు తహ్రీమాలో ఇమాముతో పాటుగా చేస్తే, అతని నమాజు ప్రారంభమే కాదు (చెల్లదు) మరియు అతను మళ్ళీ నమాజు చేయాలి. 3- ఇమామును అనుసరించడం: అనగా నమాజు యొక్క ఆచరణలను ఇమాము చేసిన తర్వాత ఆలస్యం చేయకుండా చేయడం. ఇదే ధర్మసమ్మతమైనది మరియు సున్నత్ కు అనుగుణమైనది. 4- ఆచరించడంలో బాగా ఆలస్యం చేయడం: అనగా ఇమామును అనుసరించడం అనే పరిధి నుండి బయటకు వెళ్ళేంతగా ఇమాము కంటే వెనుకబడిపోవడం. ఉదాహరణకు, ఇమామ్ రుకూ చేసి రుకూ నుండి లేవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మామూం నిలబడే ఉండటం. ఇది ధర్మసమ్మతమైన దానికి విరుద్ధం, మరియు ఇది హరామ్. అయితే, అనారోగ్యం లేదా వృద్ధాప్యం వంటి సముచితమైన కారణం ఉంటే తప్ప.

التصنيفات

ఇమామ్ మరియు ముఖ్తదీల ఆదేశాలు