إعدادات العرض
నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి…
నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
సుఫ్యాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అస్సఖఫీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština ગુજરાતી አማርኛ Yorùbá اردو Bahasa Indonesia ئۇيغۇرچە Türkçe සිංහල हिन्दी Tiếng Việt Hausa Kiswahili ไทย پښتو অসমীয়া دری Кыргызча or नेपाली Malagasy Română Kinyarwanda বাংলা Bosanski Kurdî Lietuvių Oromoo മലയാളം Nederlands Soomaali Shqip Српски Deutsch Українська ಕನ್ನಡ Wolof Mooreالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒకరైన సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. “ఇస్లాం యొక్క అర్థం పూర్తిగా, సమగ్రంగా పొందుపరిచి ఉండేలా; తద్వారా తాను దానికి విశ్వాసపాత్రునిగా ఉండేలా, మరియు దాని గురించి ఇంకెవరినీ ప్రశ్నించే అవసరం లేని విధంగా, ఒక వాక్యాన్ని తనకు బోధించమని” ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో (మనస్ఫూర్తిగా) ఇలా పలుకు అన్నారు: “నేను అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని స్థిరపరుస్తున్నాను, ఆయనను విశ్వసిస్తున్నాను, ఆయనే నా ప్రభువు, మరియు ఆయనే ఏకైక ఆరాధ్యుడు, ఆయనే నా సృష్టికర్త, మరియు ఆయనే నేను సత్యపూర్వకంగా ఆరాధించేవాడు, ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు”. “తరువాత అల్లాహ్ అనుమతించిన మరియు ఆదేశించిన వాటిని ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ ఆయనకు విధేయునిగా ఉండు, ఆ విధేయతపై స్థిరంగా ఉండు.”فوائد الحديث
ధర్మము (ఇస్లాం) యొక్క మూలము అల్లాహ్ ను విశ్వసించుట, ఆయన యొక్క “రుబూబియత్”ను (కేవలం ఆయన మాత్రమే ప్రభువు అని) విశ్వసించుట, ఆయన యొక్క “ఉలూహియత్”ను (కేవలం ఆయన మాత్రమే అన్ని రకాల ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు అని) విశ్వసించుట మరియు ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఆయన దివ్య నామములను మరియు ఆయన గుణ, విశేషాలను విశ్వసించుట – వీటిపై ఆధారపడి ఉంది.
విశ్వసించిన తరువాత దానిపై స్థిరంగా ఉండుట, ఆయనను మాత్రమే ఆరాధించుటలో స్థిరంగా కొనసాగుట – ఇవి అత్యంత ముఖ్యమైనవి.
అచంచలమైన విశ్వాసము - ఆచరణలు ఆమోదయోగ్యం కావడానికి ఒక షరతు.
అల్లాహ్ పై విశ్వాసము అనేది విశ్వాసం యొక్క మూల సిద్ధాంతాలలో వివరించిన వాటిని, మూల సూత్రాల పరంగా విశ్వసించడం; ఆ విశ్వాసం మన హృదయంలో అచంచలంగా ఉండాలి, మరియు దానికి కట్టుబడి ఉండడం, దాని పట్ల విధేయత అనేవి మన ఆచరణలలో – అవి బాహ్య ఆచరణలు కానీ, లేక అంతరంగ ఆచరణలు కానీ – వాటిలో ప్రస్ఫుటం కావాలి.
విశ్వాసము పై స్థిరత్వము అంటే – విధిగా ఆచరించవలసిన వాటిని తప్పనిసరిగా ఆచరించడం, నిషేధించిన వాటిని వదిలివేయడం ద్వారా - (ఇస్లాం చూపిన) మార్గానికి కట్టుబడి ఉండడం