إعدادات العرض
“మీరు నమాజు ఆచరించునపుడు మీ వరుసలను సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో ఒకరు నాయకత్వం వహించి (ఇమామత్ వహించి) మిగతా…
“మీరు నమాజు ఆచరించునపుడు మీ వరుసలను సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో ఒకరు నాయకత్వం వహించి (ఇమామత్ వహించి) మిగతా వారికి నమాజు చదివించాలి. అతడు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితేనే మీరు కూడా ‘తక్బీర్’ పలుకండి
హిత్తాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అర్’రఖాషీ ఉల్లేఖన: “నేను అబీ మూసా అల్ అష్’అరీ (రదియల్లాహు అన్హు) తో నమాజు ఆచరించాను. ఆయన తషహ్హుద్ లో ఉండగా, అక్కడున్న(నమాజు చదువుతున్న) వారిలో ఒకరు “ఉఖిర్రతిస్సలాతు బిల్’బిర్రి వజ్జకాతి” (“నమాజు, ధర్మబధ్ధత మరియు జకాతులతో పాటు స్థాపించబడినది”) అన్నారు. అబీ మూసా అష్’అరీ రజియల్లాహు అన్హు సలాముతో నమాజును ముగించి ప్రజల వైపునకు తిరిగి “మీలో ఎవరు అలా అన్నది?” అని ప్రశ్నించారు. ప్రజలపై మౌనం ఆవరించుకున్నది. ఆయన మళ్ళీ ప్రశ్నించారు “మీలో ఎవరు అలా అన్నది?” అని. తిరిగి ప్రజలపై మౌనం ఆవరించుకున్నది. అపుడు ఆయన “ఓ హిత్తాన్! బహుశా నీవే అలా అని ఉంటావు” అన్నారు. దానికి హిత్తాన్ “లేదు, నేను అనలేదు. మీరు కోపగిస్తారేమో అని నేను మౌనంగా ఉన్నాను” అన్నాడు. అపుడు ప్రజలలో నుండి ఒకరు “అలా అన్నది నేనే, అయితే నేను మంచి ఉద్దేశ్యముతోనే అలా అన్నాను” అన్నాడు. అపుడు అబీ మూసా ఇలా అన్నారు: “నమాజులో ఏమి పలకాలో తెలియదా నీకు? నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించారు, మరియు మాకు సున్నతును వివరించారు. మరియు నమాజులను ఆచరించమని బోధించారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు నమాజు ఆచరించునపుడు మీ వరుసలను సవ్యంగా ఉండేలా చూసుకోవాలి. మీలో ఒకరు నాయకత్వం వహించి (ఇమామత్ వహించి) మిగతా వారికి నమాజు చదివించాలి. అతడు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితేనే మీరు కూడా ‘తక్బీర్’ పలుకండి. ఎపుడైతే అతడు “గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్” (సూరహ్ అల్ ఫాతిహా: 7వ ఆయతు) అని పఠిస్తాడో, మీరు ‘ఆమీన్’ అనండి, అల్లాహ్ మీ ప్రార్థనకు స్పందిస్తాడు. ఇమాం తక్బీర్ పలికితేనే, మీరు కూడా తక్బీర్ పలుకండి, ఎందుకంటే అతడు మీ కంటే ముందుగా రుకూ చేస్తాడు, మరియు రుకూ నుండి మీ కంటే ముందుగా పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఇది దానికి సమానం అవుతుంది (మీరు అలా చేయడం ఇమాం చేసిన దానికి సమానం అవుతుంది). ఇమాం “సమి’అల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని వింటాడు (తనను కీర్తించిన వాని దుఆను వింటాడు) అని పలికితే, మీరు “అల్లాహుమ్మా, రబ్బనా లకల్ హంద్” (ఓ అల్లాహ్, మా ప్రభూ, పొగడ్తలు, కీర్తనలు అన్నీ నీ కొరకే) అని పలకండి – అల్లాహ్ మిమ్మల్ని (మీ దుఆలను) వింటాడు. ఎందుకంటే అల్లాహ్ తన సందేశహరుని నాలుక ద్వారా పలికించాడు – అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆలను) వింటాడు అని. అతడు (ఇమాం) తక్బీర్ పలికి ‘సజ్దాహ్’ చేస్తే మీరు కూడా తక్బీర్ పలికి సజ్దహ్ చేయండి. అతడు మీకంటే ముందే సజ్దహ్ చేస్తాడు మరియు మీ కంటే ముందే సజ్దహ్ నుండి పైకి లేస్తాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(మీరు) అలా చేయడం, దానికి (అతడు చేసిన దానికి) సమానం అవుతుంది. అతడు ‘తషహ్హుద్’ కొరకు కూర్చొంటే, మీ అందరిలో ప్రతి ఒక్కరి నోట ముందుగా రావాల్సిన మాటలు ఇవే అయి ఉండాలి: “అత్తహియ్యాతు, అత్తయ్యిబాతు, అస్సలవాతు లిల్లాహి, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు, అస్సలాము అలైనా, వ అలా ఇబాదిల్లాహి అస్సాలిహీన్, అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.”
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština ગુજરાતી አማርኛ Yorùbá Nederlands اردو Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe සිංහල हिन्दी Tiếng Việt Hausa Kiswahili ไทย پښتو অসমীয়া دری Кыргызча Lietuvių Kinyarwanda नेपाली മലയാളം Bosanski Italiano ಕನ್ನಡ Kurdî Oromoo Română Soomaali Shqip Српски Moore Українська Wolof Tagalog Malagasy தமிழ் Azərbaycan فارسی ქართული 中文 Magyarالشرح
సహాబీ అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఒకసారి నమాజు ఆచరించారు. నమాజులో తషహ్హుద్ చదువుట కొరకు కూర్చుని ఉండగా, ఆయన వెనుక నమాజు చదువుతున్న వారిలో ఒకరు “ఉఖిర్రతిస్సలాతు బిల్’బిర్రి వజ్జకాతి” (“నమాజు, ధర్మబధ్ధత మరియు జకాతులతో పాటు స్థాపించబడినది”) అన్నారు. అబూ మూసా రజియల్లాహు అన్హు నమాజు ముగించి తన వెనుక నమాజు చదువుతున్న వారివైపునకు తిరిగి “మీలో ఎవరు “ఉఖిర్రతిస్సలాతు బిల్’బిర్రి వజ్జకాతి” అని అన్నది?” అని అడిగారు. ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఆయన మళ్ళీ ఆ ప్రశ్నను అడిగారు. అపుడు కూడా ఎవరూ జవాబివ్వలేదు. అపుడు హత్తాన్ ను చూసి “బహుషా నీవు అలా అని ఉంటావు” అన్నారు. ఎందుకంటే అతడు తనకు బాగా దగ్గరివాడు, ధైర్యవంతుడు, తనకు అతడికి మధ్య ఉన్న బాంధవ్యము అలాంటిది. ఒకవేళ అతడు అలా అనకున్నా అతడు చెడుగా ఏమీ అనుకోడు అని ఆయనకు తెలుసు. కానీ దాని కారణంగా అసలు ఆ మాట ఎవరు అన్నారో వారు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. హత్తాన్ ‘తాను కాదు’ అని తేల్చి చెప్పి “మీరు కోపగించుకుంటారేమో అనే భయంతో అలా ఉండిపోయాను” అన్నాడు. అపుడు అక్కడున్న ప్రజలలోనుండి ఒకరు “నేను అలా అన్నది. అయితే నేను మంచి ఉద్దేశ్యముతోనే అలా అన్నాను” అన్నాడు. అప్పుడు అబూ మూసా ఒక గురువులా అతనికి బోధించారు: “తషహ్హుద్ లో ఏమి పలకాలు తెలియదా నీకు?” అన్నారు. ఆయన అలా అనడం – అతడు పలికినది సరికాదని తన అసమ్మతిని తెలియజేయడం. తరువాత అబూ మూసా (అక్కడున్న వారందరికీ) తెలియజేసారు – ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరినీ ఉద్దేశ్యించి ప్రసంగించినారని, వారికి సున్నతును బోధించినారని, తమ నమాజులను ఎలా ఆచరించాలో తెలియజేసినారని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు నమాజు ఆచరించుటకు ముందు మీ వరుసలను సరిచేసుకోండి. మీలో ఒకరు మిగతావారికి (ఇమాంగా) నమాజు చదివించాలి. ఇమాం నమాజు ప్రారంభించుటకు “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికితే, మీరు కూడా తక్బీర్ పలుకండి. అతడు సూరా ఫాతిహా పఠిస్తూ, చివరి ఆయతు “గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్” పఠించినపుడు, మీరు “ఆమీన్” అని పలకండి. మీరు అలా చేస్తే అల్లాహ్ మీ దుఆలకు స్పందిస్తాడు. అతడు తక్బీర్ పలికి రుకూ చేసినపుడు, మీరు కూడా తక్బీర్ పలికి రుకూ చేయండి. ఇమాం మీకంటే ముందు రుకూ చేస్తాడు, మరియు మీ కంటే ముందు రుకూ నుండి పైకి లేస్తాడు. కనుక అతని కంటే ముందు ఆచరించకండి. అతడు మీ కంటే ముందు రుకూ లోనికి వెళతారు కనుక, అతడు రుకూ నుండి లేచిన తరువాత మీరు ఒకింత ఆలస్యంగా రుకూ నుండి లేస్తే మీరు రుకూలో ఉన్న సమయం, అతడు రుకూలో ఉన్న సమయంతో సమానమవుతుంది. ఇమాం “సమియల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆను) విన్నాడు) అని పలికితే, మీరు “రబ్బనా, లకల్ హంద్” (ఓ మా ప్రభూ! స్తుతులు, కీర్తనలు, పొగడ్తలు అన్నీ నీ కొరకే) అని పలకండి. భక్తుడు అలా పలికితే పరమ పవితృడైన అల్లాహ్ ఆ భక్తుని దుఆలు, అతని మాటలు వెంటాడు; ఎందుకంటే సర్వోన్నతుడైన అల్లాహ్ స్వయంగా తన సందేశహరుని నాలుక పై నుండి ఆ మాటలు పలికించాడు – “సమియల్లాహు లిమన్ హమిదహ్” (అల్లాహ్ తనను కీర్తించిన వానిని (అతని దుఆలను) విన్నాడు) అని. ఇమాం “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికి ‘సజ్దాహ్’ చేస్తే, ఆయన నాయకత్వంలో, ఆయన వెనుక ఎవరైతే నమాజు ఆచరిస్తున్నారో వారు కూడా “అల్లాహు అక్బర్” అని పలికి సజ్దాహ్ చేయాలి. ఇమాం వారి కంటే ముందు సజ్దాహ్ చేస్తాడు, మరియు వారి కంటే ముందు సజ్దాహ్ నుండి పైకి లేస్తాడు. వారు అతని తరువాత ఆచరిస్తారు కనుక, వారు సజ్దాహ్ లో గడిపిన కాలము అతడు సజ్దాహ్ లో గడిపిన కాలముతో సమానం అవుతుంది. తరువాత తషహ్హుద్ పలుకుట కొరకు కూర్చున్నపుడు, నమాజు ఆచరిస్తున్న వ్యక్తి మొదటి మాట ఇది అయి ఉండాలి: “అత్’తహియ్యాతు అత్తయ్యిబాతు, అస్సలవాతు లిల్లాహి” (పొగడ్తలు, కీర్తనలు, స్తుతులు సర్వమూ అల్లాహ్ కొరకే) – అంటే, రాజ్యము ఆయన కొరకే, రక్షణ ఆయనదే మరియు ఘనత ఆయనదే, అదే విధంగా విధిగా ఆచరించవలసిన 5 పూటల నమాజు కూడా ఆయన కొరకే. తరువాత "అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు, అస్సలాము అలైనా, వ అలా ఇబాదిల్లాహి అస్సాలిహీన్” (ఓ ప్రవక్తా! మీపై శాంతి మరియు అల్లాహ్ యొక్క కరుణ ఉండుగాక, అలాగే మాపై మరియు అల్లాహ్ యొక్క ధర్మబధ్ధులైన దాసులపై కూడా) అని పలికి దాసుడు అల్లాహ్ ను ప్రతి లోపము నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి వెలితి నుండి మరియు ప్రతి అవినీతి, లంచగొండితనము నుండి రక్షణ కోరుతాడు. ఆ విధంగా అభివాదములను మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ప్రత్యేకిస్తాము, అలాగే ధర్మబధ్ధులైన అల్లాహ్ యొక్క దాసుల కొరకు కూడా ప్రత్యెకిస్తాము. ఎందుకంటే వారు అల్లాహ్ ఆదేశాలను శిరసావధించారు, అల్లాహ్ యొక్క హక్కులను, అల్లాహ్ దాసుల యొక్క హక్కులను నెరవేర్చారు. రతువాత “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధనల కొరకు వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడు అని) సాక్ష్యము పలుకుతాము.”فوائد الحديث
ఇందులో తషహ్హుద్’ పలుకబడే విధానాలలో ఒక విధానం వివరించబడింది.
ఆరాధనలకు సంబంధించిన ఆచరణలు గానీ, పలకవలసిన పదాలు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి తప్పనిసరిగా నిరూపించబడిన బోధనల నుండి అయి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు ద్వారా నిరూపింపబడని ఒక్క పదాన్నైనా, ఒక్క ఆచరణ అయినా వాటిలో కొత్తగా చేర్చడానికి ఎవరికీ అనుమతి లేదు.
అలాగే ఇమాముతో సమానముగా (పోటీ పడుతున్నట్లుగా) ఆచరించడానికీ, లేదా అతని కంటే బాగా ఆలస్యంగా ఆచరించడానికీ అనుమతి లేదు. ఇమాము వెనుక నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి ఇమాము ఏ విధంగా ఆచరిస్తున్నాడో ఆ విధంగా అనుకరించడానికి మాత్రమే అనుమతి ఉంది.
ఇందులో సందేశహరునిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ కు ధర్మానికి సంబంధించిన నియమాలను, బోధనలను అందజేసిన ప్రస్తావన ఉన్నది.
తన వెనుక నమాజు ఆచరించే వారికి ఇమాం ఒక ఉత్తమమైన నమూనా (మోడల్) వంటి వాడు. సలాహ్’కు (నమాజుకు) సంబంధించిన ఆచరణలలో అతని మించిపోయి అతని కంటే ముందు ఆచరించుట లేక అతనితో పోల్చుకొనుట, లేక అతని కంటే బాగా ఆలస్యంగా ఆచరించుట చేయరాదు. అలాకాక ఇమాం అతడు చేయలనుకున్న ఆచరణలోనికి ప్రవేశించినాడు అని ముఖ్తదీకి ఖచ్చితంగా అర్థమైపోతే వెంటనే అతడు ఇమామ్’ను ఆ అచరణలో అనుసరించాలి. అందులో ఇమామును అనుసరించడం అతనికి సున్నత్ అవుతుంది.
సలాహ్’లో (నమాజులో) నమాజు ఆచరించే ముఖ్తదీలను వరుసలలో నిలబడేలా చేయుట షరియత్’లోని భాగమే.