“ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక…

“ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నాను అని అబూదర్ గఫ్ఫారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు: “ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరిస్తున్నారు: ఎవరైనా మరొకరిని “నీవు “ఫాసిఖ్” (పాపివి, దుష్టుడవు) అని లేక “నీవు “కాఫిర్” (సత్యతిరస్కారివి, అవిశ్వాసి) అని అన్నట్లయితే; ఒకవేళ ఆ నిందమోపబడిన వ్యక్తి వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే’, తాను ఆపాదించిన ఆ గుణాలకు స్వయంగా తానే అర్హుడు అవుతాడు; మరియు అతని మాటలు అతని వైపునకే తిరిగి వస్తాయి. ఒకవేళ ఆ విధంగా ఆపాదించబడిన వ్యక్తి నిజంగానే అలాంటి వాడే అయినట్లయితే, ఆపాదించిన వాని వైపునకు ఏమీ తిరిగి రాదు, ఎందుకంటే అతడు సత్యమే పలికినాడు గనుక.

فوائد الحديث

ధర్మబద్ధమైన కారణం ఏదీ లేకుండా ఎవరినైనా “ఫిస్ఖ్”నకు పాల్బడినాడని (దుష్టత్వానికి పాల్బడినాడని), లేక “కుఫ్ర్”నకు పాల్బడినాడని (సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి పాల్బడినాడని) ఆరోపించడం హరాం అంటే నిషిద్ధం.

ప్రజలపై ఒక నిర్ధారణకు వచ్చి దానిని వెల్లడి చేయడానికి ముందు, దానిని ధృవీకరించుకోవడం విధి (వాజిబ్).

ఇబ్న్ దఖీక్ అల్-ఈద్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఒక ముస్లింను, అతడు “కుఫ్ర్”కు పాల్బడనప్పటికీ అతడిని “కాఫిర్” (సత్యతిరస్కారి, అవిశ్వాసి) అని ఆరోపించే వారి కొరకు ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. ఇది ఒక అసహ్యకరమైన లేదా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది.

ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “అయితే ఎవరనైనా మరొకరిని “నీవు ఫాసిఖ్’వి” (నీవు దుష్టుడవు, దుర్మార్గుడవు) అని గానీ లేదా “నీవు కాఫిర్’వి” (నీవు సత్యతిరస్కారివి, అవిశ్వాసివి) అని గానీ అన్న మాత్రాన అతడు దుష్టునిగానో, లేక అవిశ్వాసిగానో మారిపోడు – అంటే, వాస్తవానికి అతడు దుష్టుడు కాడు అని గానీ, అతడు అవిశ్వాసి కాడు అని గానీ కాదు ఇక్కడ దాని అర్థం. ఈ పరిస్థితిని వివరంగా పరిశీలించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఎవరినైనా “నీవు దుష్టుడవు”, లేదా “నీవు సత్యతిరస్కారివి, అవిశ్వాసివి” అనడంలో అతని ఉద్దేశ్యం – అతని ఆచరణ సరికాదు అని, అతడు సరియైన స్థితిలో లేడు అని అతనికి బోధించడం, అతని అర్థమయ్యేలా చేయడం, అతనికి నచ్చజెప్పడం అయినట్లయితే, ఆవిధంగా అనడానికి అనుమతి ఉన్నది. అలాకాక, అతడిని అవమానించాలని, అతని చర్యలను, ఆచరణలను బహిర్గతం చేసి అతడి పరువును బజారున పడవేయాలని అతని ఉద్దేశ్యం అయితే అది హరాం, దానికి అనుమతి లేదు. ఎందుకంటే, తన ముస్లిం సోదరుని తప్పులను బహిర్గతం చేయకుండా దాచి ఉంచి, అతనికి స్నేహపూర్వకంగా బోధించి, అతనికి సరియైన సలహా ఇవ్వమని షరియత్’లో ఆదేశించబడినది గనుక. అతడు విషయాన్ని సున్నితంగా పరిష్కరించి, నెరవేర్చగలినపుడు, తీక్షణమైన విధానానికి, కఠినంగా ప్రవర్తించే విధానానికి పాల్బడడం అనుమతించబడదు. ఎందుకంటే అటువంటి చర్యలు అతడిని మరింత మొండివానిగా, మరింత మూర్ఖంగా అటువంటి ఆచరణలకు, చర్యలకు పాల్బడేలా చేయవచ్చు; ఎందుకంటే చాలామంది ఎదుటివాడు తమపై ఆజ్ఙాపించడాన్ని ఇష్టపడరు, అసహ్యించుకుంటారు, మరీ ముఖ్యంగా ఆజ్ఞ ఇచ్చే వ్యక్తి ఆజ్ఞాపించబడే వ్యక్తి కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు.

التصنيفات

అవిశ్వాసం (కుఫ్ర్), విధేయత నుండి వైదొలగటం (ఫిస్క్)