“నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను (పరస్త్రీపై) అనుకోకుండా, ఆకస్మికంగా పడిన చూపును గురించి…

“నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను (పరస్త్రీపై) అనుకోకుండా, ఆకస్మికంగా పడిన చూపును గురించి ప్రశ్నించాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించినారు “నీ చూపును మరల్చుకో”

జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను (పరస్త్రీపై) అనుకోకుండా, ఆకస్మికంగా పడిన చూపును గురించి ప్రశ్నించాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించినారు “నీ చూపును మరల్చుకో”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

జరీర్ ఇబ్న్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఒక పరాయిస్త్రీని అకస్మాత్తుగా చూడటం గురించి అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాను పరాయి స్త్రీని చూస్తున్నాడని గ్రహించిన వెంటనే తన ముఖాన్ని మరో వైపునకు అంటే మరో దిశకు మళ్లించుకోవాలని ఆదేశించినారు; అపుడు అతనిపై ఏ దోషమూ ఉండదు.

فوائد الحديث

ఇందులో చూపులను క్రిందికి దించి ఉంచుకోవడాన్ని గురించి ప్రోత్సాహము ఉన్నది.

సంకల్ప పూర్వకంగా కాకుండా, దేనినైతే చూడరాదు అని నిషేధించడం జరిగిందో, దానిపై అనుకోకుండా, హఠాత్తుగా చూపు పడితే, దానిని అలాగే చూస్తూ ఉండిపోరాదని హెచ్చరిక ఉన్నది.

జరీర్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశపూర్వకంగా ఒక స్త్రీని చూసిన వ్యక్తికి వర్తించే తీర్పే, తాను ఒకవేళ అనుకోకుండా, అకస్మాత్తుగా ఒక స్త్రీని చూసినట్లైతే, అదే తీర్పు తనకు కూడా వర్తిస్తుందా అని అడిగారు. దీని ద్వారా పరాయి స్త్రీలను చూడడం నిషేధం అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల మధ్య స్థిరపడిన విషయం అని మనకు తెలుస్తున్నది.

ఈ హదీథులో అల్లాహ్ యొక్క దాసుల ప్రయోజనాల పట్ల షరియా (ధర్మశాస్త్రం) యొక్క శ్రద్ధ కనిపిస్తున్నది. ఎందుకంటే పరస్త్రీలను చూచుట కారణంగా సంభవించే ప్రాపంచిక మరియు పారమార్థిక నీతిబాహ్యత కారణంగా షరియహ్ పరస్త్రీలను చూడకుండా నిషేధించింది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి సహాబాలు తమకు తెలియని విషయాలను అడిగారు. అదేవిధంగా సామాన్య ప్రజలు తమ పండితుల వద్దకు వెళ్లి తమకు తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలి.

التصنيفات

మనస్సుల పరిశుద్ధత