“నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం)…

“నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు తరుచూ ‘స్ఖలన పూర్వ ద్రవం’ (వీర్య స్ఖలనానికి పూర్వము పురుషాంగం నుండి విదుదలయ్యే ఒక రకమైన ద్రవం) విడుదలవుతూ ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె నా భార్య కావడంతో, ఈ విషయాన్ని గురించి వారిని ప్రశ్నించడానికి నాకు సిగ్గు అనిపించేది. కనుక నేను మిగ్దాం ఇబ్న్ అల్ అస్వద్’ను దానిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని అడిగాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు తన పురుషాంగాన్ని కడుక్కొని (తరువాత) వుదూ చేయాలి”. సహీహ్ బుఖారీలో ఇలా ఉంది “అతడు వుదూకు ముందు తన పురుషాంగాన్ని కడుక్కుని వుదూ చేయాలి”.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు కు తరుచూ చిక్కగా, తెల్లగా, జిగటగా ఉండే మదీ అనే ద్రవం ఆయన పురుషాంగం నుండి విడుదలవుతూ ఉండేది. ఆ ద్రవం సాధారణంగా లైంగిక పరమైన ఆలోచనల వలన గానీ లేక సంభోగానికి ముందుగానీ విడుదలవుతుంది. తరుచూ ఆ విధంగా విడుదలవుతున్న ఆ ద్రవం విషయం లో ఏమి చేయాలో ఆయనకు అర్థమయ్యేది కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె ఫాతిమా ఆయన భార్య కావడంతో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను దానిని గురించి ప్రశ్నించడానికి సిగ్గుగా ఉండేది. కనుక ఆయన మిఖ్దాద్ బిన్ అల్ అస్వద్ రజియల్లాహు అన్హు ను, ఆ విషయాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా జవాబిచ్చారు: “అతడు పురుషాంగాన్ని కడుగుకుని వుజూ చేయాలి.”

فوائد الحديث

ఈ హదీసులో అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు యొక్క ఘనత తెలుస్తున్నది – ఆ విషయం పట్ల ఆయన సిగ్గు పడటం, వేరొకరి ద్వారానైనా ప్రశ్నించడం నుండి ఆయనను దూరంగా ఉంచలేదు.

ఈ హదీసు ద్వారా మన తరఫున ప్రశ్నించడానికి ఎవరినైనా మనం నియమించుకొన వచ్చును అనడానికి అనుమతి లభిస్తున్నది.

తాను సిగ్గు పడుతున్న తనకు సంబంధించిన ఏదైనా విషయాన్ని గురించి, ప్రజల బహుళ ప్రయోజనం కొరకు బహిరంగపరుచుట అనుమతించబడిన విషయమే.

మదీ (‘స్ఖలన పూర్వ ద్రవం’) అనేది అశుద్ధమైనదని, దానిని బట్టల నుండి మరియు శరీరానికి అంటుకుని ఉంటే శరీరం నుండి నీటితో కడిగి దూరం చేయాలి అని తెలుస్తున్నది.

మదీ (‘స్ఖలన పూర్వ ద్రవం’) విడుదల కావడం అనేది వుదూను భంగ పరిచే విషయాలలో ఒకటి.

మరొక హదీసులో పేర్కొనట్టు, శుభ్రపరుచునపుడు పురుషాంగాన్ని మరియు వృషణాలను కూడా కడగాలి.

التصنيفات

మాలీన్యములను తొలగించటం