“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము,…

“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు

ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ అల్ జుహనీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు.

[దృఢమైనది]

الشرح

ఉఖబహ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ లోకము నందు మరియు పరలోకము నందును ఒక విశ్వాసి మోక్షము పొందే మార్గములు ఏమిటి అని ప్రశ్నించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దానికి నీవు మూడు విషయాలు ఆచరించాలి” “మొదటిది: చెడు విషయాలు మాట్లాడుట నుండి, కీడు కలిగించే విషయాలు పలుకుట నుండి నీ నాలుకను అదుపులో ఉంచుకో, (నీ నాలుకతో) మంచి తప్ప మరేమీ మాట్లాడకు.” “రెండవది: నీ ఏకాంతములో అల్లాహ్’ను ఆరాధించుట కొరకు (ఎక్కువగా) ఇంటి పట్టునే ఉండు; సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు విధేయత చూపే కార్యాలలో నిన్ను నీవు నిమగ్నం చేసుకో; (ప్రాపంచిక) ప్రలోభాలనుండి, ఆకర్షణల నుండి నిన్ను నీవు వేరు చేసుకో”; “మూడవది: నీవు చేసిన పాపాల పట్ల దుఃఖపడు, విచారపడు మరియు పశ్చాత్తాపపడు.”

فوائد الحديث

మోక్షము పొందగలిగే మార్గాలను గురించి తెలుసుకొనుట కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు (సహాబాలు) ఎప్పుడూ ఆసక్తిగా ఉండేవారు.

ఈ హదీథులో, ఈ లోకమునందు మరియు పరలోకమునందు మోక్షము పొందగలిగే మార్గాలను గురించిన ప్రకటన ఉన్నది.

ఇందులో - ఇతరులకు మంచి చేయగలిగే స్థోమత, సామర్థ్యము లేనట్లయితే, లేదా తాను ఇతరులతో కలవడం కారణంగా తనకు తన ధర్మానికి హాని కలిగే అవకాశం ఉన్నట్లయితే, మనిషి తనను తాను ఇతర పనులలో నిమగ్నం చేసుకోవాలి అనే హితబోధ ఉన్నది.

ప్రత్యేకించి సాంఘిక కల్లోల సమయాలలో, లేక సంక్షోభ సమయాలలో ఒక విశ్వాసి తన ఇంటిపై అన్నివిధాలా శ్రద్ధ చూపాలి అని ఇందులో సూచించబడుతున్నది, ఎందుకంటే అటువంటి సమయాలలో ఒక వ్యక్తి తన ధర్మాన్ని కాపాడుకునే మార్గాలలో ఇది ఒకటి.

التصنيفات

మాట్లాడే మరియు మౌనంగా ఉండే పద్దతులు, తౌబా (పశ్చాత్తాపము)