“అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం…

“అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు

మఅదాన్ ఇబ్నె అబీ తల్హహ్ అల్ యఅమరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత బానిసత్వము నుండి విముక్తి పొందిన సౌబాన్ రజియల్లాహు అన్హు కలిసి ఇలా అడిగాను: “నాకు ఒక ఆచరణను గురించి తెలియ జేయండి, దేనిని నేను ఆచరించినట్లయితే దాని ద్వారా అల్లాహ్ నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడో” లేక బహుశా నేను ఇలా అన్నాను: “”అల్లాహ్ అమితంగా ఇష్టపడే ఆచరణలు ఏమిటి?” ఆయన మౌనంగా ఉండిపోయాడు. నేను మళ్ళీ ప్రశ్నించాను, ఆయన మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు, నేను మూడోసారి మళ్ళీ ప్రశ్నించాను. దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను ఇదే విధంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించాను. దానికి ఆయన: “అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు”. మఅదాన్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “తరువాత నేను అబూ దర్దా రజియల్లాహు అన్హు ను కలిసాను. ఆయనను కూడా ప్రశ్నించాను. ఆయన కూడా సౌబాన్ రజియల్లాహు అన్హు పలికిన మాదిరిగానే పలికారు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను స్వర్గములోనికి ప్రవేశించడానికి కారణమయ్యే ఆచరణలు ఏవి లేక అల్లాహ్’కు ఇష్టమైన ఆచరణలు ఏవి? అని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చినారు: “(ఎక్కువ సలాహ్’లు (నమాజులు) ఆచరించడం ద్వారా) ఎక్కువ సజ్దాలు చేయడానికి కట్టుబడి ఉండు. ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దహ్ నీ స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు నీ నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు.

فوائد الحديث

ఇందులో ముస్లింలు విధిగా ఆచరించవలసిన (ఫర్జ్) నమాజులను, మరియు స్వచ్ఛంద నమాజులను (సున్నత్ మరియు నఫీల్) నిర్వహించడంలో ఆసక్తి చూపాలని కోరడం జరిగింది, ఎందుకంటే వాటి ద్వారానే ఎక్కువ సజ్దహ్’లు చేయడం జరుగుతుంది.

అలాగే ఇందులో సహాబాల యొక్క ధర్మావగాహనకు సంబంధించి ప్రస్తావన ఉన్నది – అల్లాహ్ యొక్క కృప మరియు కరుణ తరువాత – స్వర్గం లోనికి ప్రవేశం కేవలం ఆచరణల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

అల్లాహ్’కు సజ్దాహ్ చేయడం అనేది (ఇహపరలోకాలలో) మన స్థాయి ఉన్నతం కావడానికి మరియు పాప క్షమాపణకు ఒక గొప్ప మార్గము.

التصنيفات

నమాజు ప్రాముఖ్యత