إعدادات العرض
“(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో…
“(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో ముఖాలను, చాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉన్న వారి గుంపును దాటుకుంటూ వెళ్ళినాను
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో ముఖాలను, చాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉన్న వారి గుంపును దాటుకుంటూ వెళ్ళినాను. నేను ఇలా అడిగినాను: “ఓ జిబ్రయీల్! ఎవరు వీళ్ళు?” దానికి ఆయన ఇలా జవాబిచ్చినారు: “వీరు మనుషుల మాంసం తినడంతో సమానమైన చర్యలైన 'ప్రజల వీపు వెనుక (వారి పరోక్షంలో) వారి గురించి చెడుగా మాట్లాడుట, వారిపై అపనిందలు వేయుట' చేసేవారు.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Français ئۇيغۇرچە Hausa Kurdî Русский Tiếng Việt Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย Português मराठी دری አማርኛ ភាសាខ្មែរ ગુજરાતી Nederlands Македонски ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మరియు మే’రాజ్ యాత్రలో స్వర్గనరకాల దర్శనానికి తీసుకు వెళ్ళబడినపుడు, రాగి గోళ్ళు కలిగి ఉండి వాటితో ముఖాలను, మరియు ఛాతీలను, అవి చీలికలు అయ్యేలా గోక్కుంటూ ఉన్న వ్యక్తులను దాటుకుంటూ వెళ్ళడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాంను ఇలా అడిగారు: “ఓ జిబ్రయీల్! ఏమి చేసినందుకు వీరు ఈ శిక్షకు అర్హులైనారు?” జిబ్రీల్ అలైహిస్సలాం) ఇలా జవాబిచ్చారు: “వీరు ప్రజల గురించి వారి వీపు వెనుక చెడుగా మాట్లాడేవారు, వారిపై అపనిందలు మోపేవారు మరియు వారి గౌరవానికి భంగం కలిగించేవారు.”فوائد الحديث
ఇందులో ప్రజల పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడే మరియు వారిపై అపనిందలు మోపే వారికి కఠినమైన హెచ్చరిక ఉన్నది. వారిని ఇందులో నరమాంసభక్షకులుగా అభివర్ణించడం జరిగింది.
ప్రజల గురించి వారి పరోక్షంలో మాట్లాడుట, వారిపై అపనిందలు మోపుట అనేవి “ఘోరమైన పాపాలు” (కబాయిర్).
హదీథులో “వారు ముఖాలను ఛాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉంటారు” అనే వాక్యంపై వ్యాఖ్యానిస్తూ అత్’తయ్యిబి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ముఖం మరియు ఛాతీని గీరుకోవడం అనేది ఏడుస్తున్న స్త్రీల లక్షణం కాబట్టి, ముస్లింలను తిట్టి, వారిపై అపవాదు వేసేవారికి ఇది శిక్షగా చేయబడింది. అవి పురుషుల లక్షణాలు కాదని, స్త్రీల లక్షణాలలో అత్యంత వికారమైన, మరియు అత్యంత వక్రీకరణ కలిగిన లక్షణాలు అని సంకేతంగా చెప్పబడింది.
అగోచర విషయాలను గురించి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన ప్రతి విషయాన్ని విశ్వసించడం విధి (వాజిబ్).
التصنيفات
పాపకార్యముల ఖండన