إعدادات العرض
ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు
ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఒక ప్రయాణంలో ఉండగా చాలామంది ఒకచోట కూడి ఒక వ్యక్తికి నీడను కల్పిస్తున్నారు,అది చూచి ప్రవక్త అది ఏమిటి ?అని అడిగారు అక్కడ ఉన్నవారు ‘అతడు ఉపవాసి’ అని చెప్పారు, ప్రవక్త సమాధానమిస్తూ; ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు అని చెప్పారు, ముస్లిం హదీథు నమోదు ప్రకారం ‘అల్లాహ్ మీ కొరకు అనుగ్రహించిన అనుమతిని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’ అని ఉంది.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी සිංහල ئۇيغۇرچە Hausa Português Kurdî Русский دری Македонски Tiếng Việt Magyar ქართული ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Kiswahili ગુજરાતી ភាសាខ្មែរ मराठी മലയാളം ಕನ್ನಡ Српскиالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఒక ప్రయాణంలో ఉండగా, ప్రజలు ఒక వ్యక్తి చుట్టూ గుమిగూడి అతనికి ఎండ వేడిమి మరియు తీవ్రమైన దాహం నుండి నీడ కల్పిస్తున్నట్లు చూశారు. ఆయన, 'అతనికి ఏమైంది?' అని అడిగారు. వారు, 'అతను ఉపవాసంలో ఉన్నాడు' అని చెప్పారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: ప్రయాణం లో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు, అల్లాహ్ మీ కొరకు అనుగ్రహించిన అనుమతిని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.فوائد الحديث
ఇస్లామీయ షరియతు యొక్క సరళతపై వివరణ
ప్రయాణంలో ఉపవాసం పాటించడం గురించిన అవకాశం మరియు ఉపవాసం వదిలి వేసే సడలింపును ఉపయోగించుకోవాలనే ఆదేశం.
ప్రయాణంలో ఉపవాసం కష్టం కలిగిస్తే, అది ప్రాణహాని స్థాయికి చేరనంత వరకు మక్రూహ్ అవుతుంది. ఒకవేళ ప్రాణహాని స్థాయికి చేరితే, అప్పుడు అది హరామ్ అవుతుంది.
అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: 'ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదం కాదు' అనగా: మీకు కష్టంగా అనిపించినప్పుడు మరియు హాని జరుగుతుందని భయపడినప్పుడు. హదీథు యొక్క సందర్భం కూడా ఇదే వివరణను సూచిస్తున్నది.
సహాబాల పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధ మరియు వారి బాగోగుల గురించి వాకబు చేయడం.
التصنيفات
కారణములు కల వారి ఉపవాసాల